MP Dharmapuri Arvind: బ్యాన్ అయిందనకున్న గేమ్ మళ్లీ వస్తుంది.. భాతీయుల డేటాకు ముప్పు.. కేంద్రానికి ఎంపీ అరవింద్ లేఖ!

నిషేధించిన పబ్జీ మొబైల్ గేమ్‌ను మొబైల్ ఇండియాగా తిరిగి ప్రారంభించడంపై నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

MP Dharmapuri Arvind: బ్యాన్ అయిందనకున్న గేమ్ మళ్లీ వస్తుంది.. భాతీయుల డేటాకు ముప్పు.. కేంద్రానికి ఎంపీ అరవింద్ లేఖ!
Battlegrounds Mobile India
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 05, 2021 | 5:26 PM

 Nizamabad MP urges IT Minister: నిషేధించిన పబ్జీ మొబైల్ గేమ్‌ను మొబైల్ ఇండియాగా తిరిగి ప్రారంభించడంపై నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడే ఈ ఆన్‌లైన్ గేమ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. భారతీయులను దెబ్బ తీసేందుకు చైనా దొంగ దారిన వస్తుందంటూ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

చిన్నారులను, యువతను గంటల తరబడి ఫోన్లకు అడిక్ట్ అయ్యేలా చేసిన పబ్జీ గేమ్ మరో రూపంలో దేశంలోకి త్వరలో ఎంట్రీ కాబోతుంది. చైనా యాప్ కావడంతో కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన ఈ డేంజర్ గేమ్.. అవే ఫీచర్స్‌‌‌‌తో కొరియా నుంచి భారత్‌లో అడుగుపెట్టబోతుంది. క్రాఫ్టన్ అనే సంస్థ బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్​లోకి ఈ యాప్​ను తీసుకురాగా.. ఇప్పటికే కోటిన్నర మంది ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

అయితే, బ్యాన్ అయిందనకున్న గేమ్ మళ్లీ వస్తుందని తెలియడంతో అందరిలో ఆందోళన నెలకొంది. పబ్జీ మళ్లీ వస్తే యువత, ముఖ్యంగా విద్యార్థులు ఫోన్లకు అడిక్ట్ అయ్యే ప్రమాదముందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 2న కేంద్రానికి రాసిన తన లేఖలో.. ఈ ఆటకు వ్యతిరేకంగా తనకు పలు ఫిర్యాదులు వచ్చాయని, ఇవి ముందుకు తెచ్చిన సమస్యలు తీవ్రమైన స్వభావం కలిగి ఉన్నాయని, వీటిని ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి ప్రమాదకర ఆటలు కాకుండా భారత సంస్కృతి, చరిత్ర ఆధారంగా ఆటల అభివృద్ధిని ప్రోత్సహించాలన్నారు. భారతీయ నీతి, విలువలను ప్రతిబింబించేలా ఆన్‌లైన్ ఆటల కోసం హాకథాన్‌లు నిర్వహించాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారని ఈ సందర్భంగా రాసిన లేఖలో అరవింద్ స్పష్టం చేశారు.

Bjp Mp Dharmapuri Arvind Letter

Bjp Mp Dharmapuri Arvind Letter

చైనా యాప్ పబ్జీని కేంద్రం గతేడాది సెప్టెంబర్ 2న నిషేధించిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్లలో ఈ గేమ్‌‌‌‌కు బానిసలైన వాళ్లు మతిస్థిమితం కోల్పోవడం, గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు హెచ్చరిస్తే ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పబ్జీని నిషేధించాలనే డిమాండ్ పేరేంట్స్ నుంచి వెల్లువెత్తింది. ఈ క్రమంలోనే చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదం కారణంగా చైనా యాప్‌‌‌‌లను నిషేధించడంతో అందులో పబ్జీ కూడా ప్లే స్టోర్ నుంచి తోలగించారు. దీంతో పబ్జీ గేమర్లు షాక్‌‌‌‌కు గురికాగా, తల్లిదండ్రులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు.

Read Also…  భారత-చైనా దేశాల మధ్య సమస్యలను ‘ ఆ ఇద్దరూ’ పరిష్కరించుకోగలరు …రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..