AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైనర్ బాలికపై రేప్ కేసులో టీవీ నటుడు పెర్ల్ పురికి బెయిల్… సహ నటి కరిష్మా తన్నా హర్షం.

మైనర్ బాలికపై రేప్ కేసులో టీవీ నటుడు పెర్ల్ వీ.పురికి బెయిల్ లభించింది. ముంబైలోని వాలివ్ పోలీసు స్టేషన్ ఖాకీలు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అతడిని నిన్న అరెస్టు చేశారు. అయితే ఈయనపై మైనర్ బాలిక పెట్టిన కేసు కొన్నేళ్ల క్రితం నాటిదని...

మైనర్ బాలికపై రేప్ కేసులో టీవీ నటుడు  పెర్ల్ పురికి బెయిల్... సహ నటి కరిష్మా తన్నా హర్షం.
Tv Actor Pearl Puri Gets Bail In Alleged Rape Case
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 05, 2021 | 5:42 PM

Share

మైనర్ బాలికపై రేప్ కేసులో టీవీ నటుడు పెర్ల్ వీ.పురికి బెయిల్ లభించింది. ముంబైలోని వాలివ్ పోలీసు స్టేషన్ ఖాకీలు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అతడిని నిన్న అరెస్టు చేశారు. అయితే ఈయనపై మైనర్ బాలిక పెట్టిన కేసు కొన్నేళ్ల క్రితం నాటిదని వారు చెప్పారు. టీవీ షోలలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి పెర్ల్ లైంగికంగా తనను వేధించాడని ఆమె అప్పట్లో తన ఫిర్యాదులో పేర్కొందని వారు తెలిపారు. నాగిన్-3 సీరియల్ లో నటించిన పెర్ల్ చాలా పాపులర్ అయ్యాడు. అతనికి బెయిల్ లభించిందని తెలియగానే అతని సహ నటి కరిష్మా తన్నా హర్షం వ్యక్తం చేసింది. సత్యమేవ జయతే …సత్యమే జయిస్తుంది అని ట్వీట్ చేసింది.ఈమెతో బాటు నిర్మాత ఏక్తాకపూర్, మరో నటి అనితా హాసనందిని వంటి పలువురు పెర్ల్ పై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశారు. అతనికి తమ మద్దతు ప్రకటించారు. ఏక్తా కపూర్ తన ఫేస్ బుక్ లో ” మైనర్ బాలిక తల్లి అసలు విషయాలు తనతో చెప్పిందని..పెర్ల్ నిర్దోషి అని పలుమార్లు స్పష్టం చేసిందని వెల్లడించారు. పెర్ల్ గుణగణాలు తనకు తెలుసునని, ఆ నటుడు అలాంటివాడు కాడని ఆమె పేర్కొంది.

2018-19 లో ప్రసారమైన నాగిని-3 టీవీ సీరియల్ లోను, ఆ తరువాత 2019-20 లో బేపనాహ్ ప్యార్ అనే సీరియల్ లోను పెర్ల్ నటించాడు. 2013 లో మొదటిసారిగా దిల్ కీ నజర్ సే ఖూబ్ సూరత్ అనే టీవీ షోలో కనిపించాడు. బ్రహ్మరాక్షస్-2 లో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: Balakrishna : ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య.. ( వీడియో )

Nithiin: మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్…త్వరలోనే సెట్స్ పైకి కొత్త సినిమా… ( వీడియో )

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..