భారత-చైనా దేశాల మధ్య సమస్యలను ‘ ఆ ఇద్దరూ’ పరిష్కరించుకోగలరు …రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ ఇద్దరూ బాధ్యత గల నాయకులని, వారు తమ దేశాల మధ్య గల సమస్యలను పరిష్కరించుకోగలరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఈ ప్రక్రియలో మరో దేశం...
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ ఇద్దరూ బాధ్యత గల నాయకులని, వారు తమ దేశాల మధ్య గల సమస్యలను పరిష్కరించుకోగలరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఈ ప్రక్రియలో మరో దేశం (రీజనల్ పవర్) జోక్యం చేసుకోజాలదన్నారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన ‘క్వాడ్’ ను ఆయన బహిరంగంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. భారత-చైనా దేశాల మధ్య సంబంధాల విషయంలో ఇతర దేశాలు ఎంతమేరకు జోక్యం చేసుకుంటాయన్న అంశం తమకు సంబంధించినది కాదని, కానీ ఈ రెండు దేశాలకు వ్యతిరేకంగా ఇతర దేశాలు మైత్రిని కుదుర్చుకోవడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. క్వాడ్ లోని గ్రూపింగ్ తో ఇండియా చేతులు కలపడం..ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని తగ్గించడానికి జరిగిన ప్రయత్నమేనని చైనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ..క్వాడ్ ను మీరు విమర్శిస్తున్నారా అన్న ప్రశ్నకు పుతిన్ ఈ సమాధానమిచ్చారు.ఇండియాతోనూ, చైనాతో కూడా తమ దేశ సంబంధాల విషయంలో పరస్పర వైరుధ్యాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆ ఉభయ దేశాల మధ్య అపరిష్కృత సమస్యలు చాలానే ఉన్నాయి..కానీ వాటిని మోదీ, జిన్ పింగ్ పరిష్కరించుకోగలుగుతారు అని ఆయన పేర్కొన్నారు.వారు బాధ్యత గల నేతలు..ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉంది..ఏ పరిస్థితినైనా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఒక పరిష్కారానికి రాగలుగుతారు అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఏమైనా మూడో దేశం జోక్యం చేసుకోజాలదు అని చెప్పారు.
ఈ రెండు దేశాల మధ్య లడాఖ్ ప్రధాన కొరకరాని కొయ్యగా.. ప్రధాన సమస్యగా ఉంటూ వస్తోంది. ఇప్పటికే నియంత్రణ రేఖ వద్ద లోగడ ఇరు దేశాల సైనిక దళాలు తలపడ్డాయి. బహుశా ఈ నేపథ్యంలోనే పుతిన్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనబడుతోంది. .
మరిన్ని ఇక్కడ చూడండి: Balakrishna : ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య.. ( వీడియో )