Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Twitter: ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం చివరి వార్నింగ్‌.. నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు

Central Twitter: కొత్త ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం ప్రభుత్వం, ట్విటర్ మధ్య మళ్లీ వివాదం ముదురుతోంది. (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రూల్స్‌కు సంబంధించి ఇప్పటి..

Central Twitter: ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం చివరి వార్నింగ్‌.. నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు
Twitter
Follow us
Subhash Goud

|

Updated on: Jun 05, 2021 | 5:01 PM

Central Twitter: కొత్త ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం ప్రభుత్వం, ట్విటర్ మధ్య మళ్లీ వివాదం ముదురుతోంది. (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రూల్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు ట్విటర్ స్పందించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ల నియామకంలో కొత్త ఐటీ నిబంధనలను పాటించాలని మరోసారి గట్టిగా దేశాలు జారీ చేసింది. ఇదే చివరి అవకాశమని, లేదంటే తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని కేంద్ర సర్కార్ శనివారం నోటీసులు జారీ చేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్‌ ఖాతాకు బ్లూటిక్‌ తొలగింపు వివాదం తర్వాత తాజాగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో కేంద్రం ప్రభుత్వం, ట్విటర్‌ వార్‌ మరింత ముదురుతోంది. దేశ ఐటీ నిబంధనలను తక్షణమే పాటించేలా ట్విటర్‌కు నోటీసులు ఇచ్చామని కేంద్రం తెలిపింది.

అయితే కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 25న ప్రకటించిన కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ట్విటర్‌తో సహా ముఖ్యమైన సోషల్‌ మీడియాలకు నిబంధనలు పాటించడానికి మూడు నెలల సమయం ఇచ్చింది. ఇక ఐటీ నిబంధనల ప్రకారం దేశీయంగా అధికారులను నియమించేందుకు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇప్పటివరకు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ వివరాలను అందించలేదని ట్విటర్‌కు ఇచ్చిన నోటీసులో కేంద్రం పేర్కొంది. అలాగే ట్విటర్‌ చిరునామా నిబంధనల ప్రకారం కూడా లేదని వ్యాఖ్యానించింది. సరైన సమాచారం అందించలేదని కేంద్ర మంత్రిత్వశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిబంధనల అమలు విషయంలో విఫలమైతే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) చట్టం 2000, సెక్షన్ 79 ప్రకారం లభించే మినహాయింపులను ఉపసంహరించుకుంటామని తెలిపింది. దీని ప్రకారం సంబంధిత పరిణామాలు, జరిమానా చర్యలకు ట్విటర్‌ బాధ్యత వహించాలని కేంద్ర సర్కార్‌ స్పష్టం చేసింది.

అయితే గడువు ముగిసినా ట్విటర్ సహా పలు సామాజిక మాధ్యమాలు మాత్రం కొత్త నిబంధనలను పాటించడం లేదు. నిబంధనల ప్రకారం భారత్‌లో చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంది. ట్విటర్‌ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను కూడా నియమించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరి సారిగా నోటీసులు పంపుతున్నామని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. కాగా, భారత ఐటీ నిబంధలను విదేశీ సామాజిక మాధ్యమాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇటీవల వాట్సప్ సైతం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాకు వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ మార్క్‌ను శనివారం ట్విటర్ తొలగించింది. ఈ క్రమంలో ట్విటర్ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి ట్విటర్ ఖాతాకే బ్లూ టిక్ తొలగిస్తావా? ఎంత ధైర్యం? అంటూ విరుచుకుపడ్డారు. ట్విటర్‌ను ఇండియాలో బ్యాన్ చేయాలని ట్వీట్ల మోత మోగించారు. దాంతో తప్పు తెలుసుకున్న ట్విటర్.. వెంకయ్యనాయుడి ఖాతాకు మళ్లీ బ్లూ టిక్ పునురుద్ధరించింది. కొంతకాలంగా ఆ ఖాతా యాక్టివ్‌గా లేకపోవడం వల్లే తొలగించామని చెప్పుకొచ్చింది. అది జరిగిన కొన్ని గంటల్లోనే ట్విటర్‌కు కేంద్రం ఫైనల్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమయింది.

ఇవీ కూడా చదవండి:

Venkaiah Naidu: భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి ట్విట్ట‌ర్ బ్లూ టిక్ తొల‌గించిన యాజ‌మాన్యం.. కార‌ణం ఏమై ఉంటుంది?

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. సెలవు దినమైన ఆదివారం కూడా ఖాతాల్లో జీతం జమ.. ఎప్పటి నుంచి అమలు అంటే..!