Seva Bharathi: కోవిడ్ బాధితులకు అండగా ‘సేవా భారతి’.. ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభం..
Seva Bharathi: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు ‘సేవా భారతి’ సంస్థ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్..
Seva Bharathi: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు ‘సేవా భారతి’ సంస్థ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించిన సేవా భారతి సంస్థ.. తాజాగా ఉచిత అంబులెన్స్ సర్వీస్‌లను కూడా ప్రారంభించింది. ఉచిత అంబులెన్స్ సేవలు కావాలనుకునేవారు 040-48213100 నంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. బర్కత్‌పురా కేశవనిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాభారతి ప్రాంతీయ అధ్యక్షుడు దుర్గారెడ్డి, కార్యదర్శి ప్రభల రామ్మూర్తి, సహ కోశాధికారి మంజూషా, చలసాని మాలతి స్మారక సమితి మేనేజింగ్ ట్రస్టీ చలసాని బలరామ్ ప్రసాద్, ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్, క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ ఆలె శ్యామ్ కుమార్, తెలంగాణ ప్రాంత సహ సంఘ్ చాలక్ సుందర్ రెడ్డి, ప్రాంత ప్రచారక్ దేవేందర్ రెడ్డి, సహప్రాంత ప్రచారక్ శ్రీధర్, ప్రాంత సేవా ప్రముఖ్ వాసు, ఇతర సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సేవా భారతి ఇటీవలే హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించింది. 200 పడకల ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే వందలాది మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ స్వల్ప లక్షణాలు కలిగి ఉండి అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చేందుకు సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు సేవా భారతి ప్రతినిధులు. ఈ సలహా కేంద్రంలో వైద్యులు ఆన్‌లైన్ ద్వారా సలహాలందిస్తారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల లోపు 040-48213100 నెంబర్‌కు ఫోన్ చేసి కోవిడ్ చికిత్సపై వైద్యుల సలహాలు తీసుకోవచ్చునని వారు తెలిపారు.
ఇదిలాఉంటే.. వరంగల్ అర్బన్ జిల్లాలోనూ సేవా భారతి 30 పడకల ఉచిత కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హంటర్ రోడ్‌లోని శ్రీవ్యాస ఆవాసంలో సేవా భారతి, యూత్ ఫర్ సేవా సయుక్తంగా ‘వర్చుస’ సంస్థ సహకారంతో ఈ ఐసోలేషన్‌ను కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉచిత వసతి, పౌష్టికాహార భోజనంతో పాటు మందులు అందజేస్తున్నారు. ఈ కేంద్రంలో డాక్టర్ల పర్యవేక్షణ, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. కరోనా బారిన పడిన పేద కుటుంబాల వారు, చిన్న గదులలో అద్దెకుంటూ ఇబ్బంది పడుతున్న స్వల్ప లక్షణాలు కలిగిన 60 సంవత్సరాల లోపు కోవిడ్ పేషెంట్లు 7207416163 మొబైల్ నెంబర్‌కి ఫోన్ చేసి ఈ కేంద్రంలో చేరవచ్చని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు.
Also read: