Telangana Govt: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. 19 జిల్లా కేంద్రాలలో డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటు.. సోమవారం నుంచే..

Telangana Govt: రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోస్టిక్ సెంటర్లను)..

Telangana Govt: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. 19 జిల్లా కేంద్రాలలో డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటు.. సోమవారం నుంచే..
Diagnostic Centers
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 05, 2021 | 4:25 PM

Telangana Govt: రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోస్టిక్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లో ఈ డయాగ్నోసిస్ సెంటర్లను ప్రారంభించాలని వైద్య అధికారులను సీఎం ఆదేశించారు.

శనివారం నాడు వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్య సేవల గురించి పలు అంశాల మీద అధికారులతో సీఎం చర్చించారు. ఇదే సమయంలో గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయనే విషయాన్ని వైద్యాధికారులు తన దృష్టికి తెచ్చిన నేపథ్యంలో.. వాటిని సోమవారం నుంచి ప్రారంభించాలని వైద్యాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామని చెప్పుకొచ్చారు. సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేస్తున్నదని పేర్కొన్నారు. వైద్యంలో అత్యంత కీలకమైన డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భం అని అన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రారంభించనున్న ఈ ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వైద్యులు తెలిపారు. వీటిలో కరోనా పరీక్షలతో పాటుగా రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ, షుగర్, గుండె జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీ కి సంబంధించిన పరీక్షలు కూడా ఉంటాయన్నారు. ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాలు పేద ప్రజలకు ఎంతగానో ఆసరా అవుతాయని ముఖ్యమంత్రి, అధికారులు పేర్కొన్నారు.

Also read:

Rajamouli: ఒకే ఫ్రేమ్‌లో తారక్, చెర్రీ డ్యాన్స్ వేస్తే ఎట్టా ఉంటుంది.. బాక్స్ బ‌ద్ద‌లే.. RRRలో ఆ సీన్ షురూ !