Woman Suicide Attempt: కరోనా వెంటాడుతోంది.. భయం ప్రాణాలు తీస్తోంది.. కేజీహెచ్‌లో కోవిడ్ పేషెంట్ ఆత్మహత్యాయత్నం!
కరోనా బాధితురాలు విశాఖ కేజీహెచ్ మేడ పైనుంచి దూకబోయింది. తక్షణమే గమనించిన సిబ్బంది ఆమెను కాపాడారు.
Woman tries to kill self at KGH: కరోనా బాధితురాలు విశాఖ కేజీహెచ్ మేడ పైనుంచి దూకబోయింది. తక్షణమే గమనించిన సిబ్బంది ఆమెను కాపాడారు. తనను ఇంటికి పంపించాలని బాధితురాలు వైద్యులను కోరగా.. ఆమె కోలుకోకపోవటంతో వైద్యులు సర్దిచెప్పారు. విశాఖపట్నం కేజీహెచ్‌లో సీఎస్ఆర్ బ్లాక్ పైనుంచి దూకబోయిన కోవిడ్ బాధితురాలిని..వైద్య సిబ్బంది రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని గమనించిన సిబ్బంది.. తక్షణమే స్పందించి సదరు మహిళను కాపాడారు. కొద్దిరోజులుగా ఆమె కుటుంబానికి దూరంగా ఉండటంతో.. ఇంటికి తరలించాలని వైద్యులను కోరింది. ఆమె కోలుకోకపోవటంతో వైద్యులు సర్ది చెప్పారు. ఇదే క్రమంలో ఆమె చికిత్స పొందుతున్న గది కిటికీ వద్దకు వెళ్లి దూకేందుకు సిద్ధపడింది. సమీపంలో ఉన్న మరో కోవిడ్ బాధితుడు గమనించి కేకలు వేయడంతో అప్రమత్తమైన సిబ్బంది.. ఆమెను అడ్డుకున్నారు.
ఇదిలావుంటే, కేజీహెచ్ ఆసుపత్రిలోని ఈ బ్లాక్‌లో ఇప్పటికే మేడ పైనుంచి దూకి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది వెల్లడి చేయలేదు. సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో విషయం తెలిసింది. దీంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.