AP Weather Report: రాగల మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్..

AP Weather Report: రాగల 24 గంటలలో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.

AP Weather Report: రాగల మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్..
Ap Weather Report
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 05, 2021 | 4:02 PM

AP Weather Report: రాగల 24 గంటలలో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. నైరుతి రుతు పవనాల ఎఫెక్ట్ వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాతరణంలో చాలా మార్పులు వస్తాయన్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఇలా ఉంది.

ఉత్తర కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అలాగే కొన్ని కొన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక సోమవారం నాడు ఉత్తర కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి.

దక్షిణకోస్తాంధ్ర విషయానికి వస్తే.. ఈ రోజు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది. సోమవారం నాడు దక్షిణ కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి. రాయలసీమ ప్రాంతంలోనూ దాదాపుగా ఇదే తీరుగా వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల కురుసే ఛాన్స్ ఉంది. సోమవారం నాడు కూడా అక్కడక్కడ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Also read:

NBCC Recruitment 2021: ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు వేత‌నం పొందొచ్చు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే