SkinCare Tips: జామ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్‏ను తొలగించే దివ్య ఔషదం జామ ఆకు..

జామ చెట్టు.. దాదాపు చాలా మంది ఇళ్లలో ఈ చెట్టు కనిపిస్తుంది. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్ని విషయ తెలిసిందే.

SkinCare Tips: జామ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్‏ను తొలగించే దివ్య ఔషదం జామ ఆకు..
Guava Leaf
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2021 | 4:14 PM

జామ చెట్టు.. దాదాపు చాలా మంది ఇళ్లలో ఈ చెట్టు కనిపిస్తుంది. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్ని విషయ తెలిసిందే. షుగర్ పేషెంట్స్‏కు ఈ జామ పండు చాలా మంచివి. అయితే ఈ జామ పండ్లు మాత్రమే కాకుండా.. జామ ఆకులు కూడా చర్మానికి ఎంతో మంచి చేస్తాయి. ముఖ్యంగా ఈ జామ ఆకులు.. ముఖంపై ఏర్పడే.. మొటిమలు, మచ్చలు, స్కిన్ టోన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. జామ ఆకుల పేస్ట్ ను ముఖంపై రాసుకుంటే.. ఈ సమస్యలను తొందరగా నివారించవచ్చు. జామ పళ్ల మాదిరిగానే ఆకులలో కూడా పొటాషియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మానికి సూపర్ ఫుడ్ గా ఉంటాయి. అందుకే చాలా మంది ఆయుర్వేద నిపుణులు జామ ఆకులు మనకు ఎంతగా మేలు చేస్తాయో వివరిస్తుంటారు. తాజాగా ఆయుర్వేద డాక్టర్ ప్రియా బహులేయన్ జామ ఆకుల వలన కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఐసోఫ్లేవనాయిడ్స్, గల్లిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం, కెరోటినాయిడ్లు వంటి క్రియాశీల పదార్ధాల వల్ల జామ ఆకులు యాంటీమైక్రోబయాల్ చర్యను కలిగి ఉంటాయి. ఇవి చర్మ వ్యాధులు, మంటలను తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యలను తగ్గిస్తాయి అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.

జామ ఆకుల పేస్ట్ ఎలా తయారు చేయాలంటే.. కావలసినవి.. * జామ ఆకులు * వాటర్ వీటిని మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఎలా అప్లై చేయాలంటే.. ముందుగా మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ఆ తర్వాత మీ ముఖాన్ని అలాగే 5 నిమిషాల వరకు వదిలేయ్యాలి. ఆ తర్వాత జామ ఆకుల పేస్ట్ ను మీ ముఖంపై అప్లై చేయాలి. ఇది పూర్తిగా ఆరిపోయే వరకు వదిలేసి.. ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ పేస్ట్ ను నెలకు 2 నుంచి 3 సార్లు ముఖంపై అప్లై చేయడం వలన మీ ముఖం అందంగా కనిపిస్తుంది.

ముందుగా చర్మంపై ఈ పేస్ట్ ను పరీక్షించాలి. చర్మంపై చికాకు, ర్యాషెస్ ఉన్నవారు పరీక్షించుకోవాలి.

Also Read: The Family Man-2: డాక్యూమెంటరీ చూస్తే భయమేసింది.. కానీ కన్నీటి గాథలను చూసి గుండె తరుక్కుపోయింది.. సమంత..

Gopichand: తేజ దర్శకత్వంలో గోపిచంద్ సినిమా.. ‘అలివేలుమంగ వేంకటరమణ’ షూటింగ్ స్టార్ట్ అప్పుడే..