The Family Man-2: డాక్యూమెంటరీ చూస్తే భయమేసింది.. కానీ కన్నీటి గాథలను చూసి గుండె తరుక్కుపోయింది.. సమంత..

Samantha Akkineni: పాపులర్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ -1 కు కొనసాగింపుగా.. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లను దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు.

The Family Man-2: డాక్యూమెంటరీ చూస్తే భయమేసింది.. కానీ కన్నీటి గాథలను చూసి గుండె తరుక్కుపోయింది.. సమంత..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2021 | 3:40 PM

Samantha Akkineni: పాపులర్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ -1 కు కొనసాగింపుగా.. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లను దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. అయితే ఇందులో సమంత అక్కినేని కీలక పాత్రలో నటించగా.. మొదటి సిరీస్ మాదిరిగానే.. ముఖ్య పాత్రలలో మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణిలు నటించారు. అయితే ఈ సిరీస్ విడుదలకు ముందే చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.. ఈ సిరీస్ విడుదలను ఆపేయాలంటూ.. తమిళుల నుంచి డిమాండ్స్ వచ్చినా.. ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ లో విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది. ఇదిలా ఉంటే.. ఇందులోని తన పాత్ర గురించి ఇప్పటివరకు మౌనంగా ఉన్న సమంత తాజాగా స్పందించింది.

ఈ వెబ్ సిరీస్ లో సమంత రాజ్యలక్ష్మి (రాజీ) పాత్రలో తన నటన అద్భుతంగా ఉందంటూ.. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరీస్ పై స్పందించిన సామ్.. రాజీ పాత్ర తనకెంతో స్పెషల్ అని చెప్పింది. ఇప్పుడు ఫ్యామిలీ మేన్‌-2 వెబ్ సిరీస్‌కు వస్తున్న రిస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ముందుగా తనకు రాజీ రోల్ ఆఫర్ చేసినప్పుడు ఈ పాత్ర చేయడానికి సెన్సిటివిటీ, బ్యాలెన్స్ ఎంతో అవసరమనుకున్నాను. ఈ మూవీలో భాగమయ్యే ముందు.. ఈలం యుద్ధంలో తమిళుల పోరాటాలు, మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసే కొన్ని డాక్యూమెంటరీలను చూసి చాలా భయపడ్డానని సమంత తెలిపింది. ఆ సమయంలో వాళ్ళు పడిన కష్టాలు, కన్నీటి గాథలను చూసి గుండె తరుక్కుపోయిందని సమంత భావోద్వేగం చెందింది. ఈ యుద్ధంలో ఎంతో ప్రాణ నష్టం జరిగిందని.. అయినా కానీ వాళ్ల వైపు ప్రపంచం చూడలేదు.. రాజీ కథ కల్పితమైనప్పటికీ.. అసమాన యుద్ధం కారణంగా మరణించిన వారికి.. ఇప్పటికీ ఆ బాధకరమైన జ్ఞాపకాల్లో జీవిస్తున్న వారికి ఇది ఒక నివాళి అని సమంత పేర్కొంది. రాజీ కథ మనకు ఎంతో అవసరమని.. ఈ పాత్ర ఒక రోల్ మోడల్ వంటిదని సమంత తెలిపింది. ద్వేషం.. అణచివేత లాంటి విషయాలపై పోరాడటానికి మనుషులు కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను అని సామ్ తెలిపింది.

ట్వీట్..

Also Read: Gopichand: తేజ దర్శకత్వంలో గోపిచంద్ సినిమా.. ‘అలివేలుమంగ వేంకటరమణ’ షూటింగ్ స్టార్ట్ అప్పుడే..