Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand: తేజ దర్శకత్వంలో గోపిచంద్ సినిమా.. ‘అలివేలుమంగ వేంకటరమణ’ షూటింగ్ స్టార్ట్ అప్పుడే..

టాలీవుడ్‏లోకి విలన్ గా పరిచయమై.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్.. ఆ తర్వాత.. హీరోగా వరుస సినిమాలు చేస్తూ..

Gopichand: తేజ దర్శకత్వంలో గోపిచంద్ సినిమా.. 'అలివేలుమంగ వేంకటరమణ' షూటింగ్ స్టార్ట్ అప్పుడే..
Gopichand
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2021 | 3:11 PM

టాలీవుడ్‏లోకి విలన్ గా పరిచయమై.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్.. ఆ తర్వాత.. హీరోగా వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోగా ఎదిగారు. అయితే జిల్ సినిమా తర్వాత గోపీచంద్ కెరీర్ లో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. ఇటీవల విడుదలైన సీటిమార్ సినిమా కూడా మరోసారి గోపిచంద్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ఈసారి చేయబోయే సినిమాల విషయంలో గోపిచంద్ చాలా స్ట్రిక్ట్ గా ఉండనున్నట్లుగా టాక్. కథలు ఎంచుకునే విషయంలో అచితూచి అడుగులు వేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ తేజ రూపొందించబోయే చిత్రం అలివేలుమంగ వేంకటరమణ.

ఈ సినిమా గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ లెటేస్ట్ అప్ డేట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆగస్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట మేకర్స్. వాస్తవానికి ఈ మూవీ షూట్ జూన్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాడట డైరెక్టర్ తేజ. కానీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న పరిస్థులతో ఈ సినిమా చిత్రీకరణను వాయిదా వేసుకున్నారు. అయితే ఆగస్ట్ నాటికి పరిస్థితులు మెరుగుపడితే.. అలివేలుమంగ వేంకటరమణ ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే.. తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టిన దర్శకుడు తేజతో గోపిచంద్ హీరోగా చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇప్పటికే తేజ.. గోపిచంద్‏ను దృష్టిలో పెట్టుకొని.. కథను పూర్తిగా సిద్ధం చేసుకున్నాడట. అయితే ఈ సినిమాలో గోపిచంద్ సరసన కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

Also Read: Rajamouli: కరోనా పై రాజమౌళి కీలక నిర్ణయం.. కోవిడ్ పరిస్థితులపై షార్ట్‏ఫిల్మ్.. తర్వలోనే రిలీజ్ ?

Prabhas Adipurush: ఆదిపురుష్‌కు ప్ర‌భాస్ అంత తీసుకుంటున్నాడా.? బాలీవుడ్ హీరోల‌కు సైతం దిమ్మ‌దిరిగి పోవాల్సిందే..

World Environment Day 2021: పర్యావరణ పరిరక్షణ అంశంపై బాలీవుడ్ చిన్నచూపు.. 32 ఏళ్లలో ఈ అంశంపై ఒక్కటే సినిమా!