Telangana Corona Cases Updates: తెలంగాణలో 3,821 పాజిటివ్ కేసులు నమోదు.. 23 మంది మృతి..

Telangana Corona Cases Updates: కరోనా కట్టడికై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

Telangana Corona Cases Updates: తెలంగాణలో 3,821 పాజిటివ్ కేసులు నమోదు.. 23 మంది మృతి..
Follow us

|

Updated on: May 25, 2021 | 9:04 PM

Telangana Corona Cases Updates: కరోనా కట్టడికై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 81,203 మంది శాంపిల్స్ పరీక్షించగా.. వారిలో 3,821 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పాజిటివ్ వచ్చిన వారి కంటే కూడా అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,298 మంది కరోనాను జయించారు. ఇక కరోనా ప్రభావంతో రాష్ట్రంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మరణాల రేటు 0.56 శాతం ఉండగా.. రికవరీ రేటు 92.52 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 38,706 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో ఇప్పటి వరకు 5,60,141 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 5,18,266 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,169 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలాఉంటే.. తాజాగా రాష్ట్రంలో తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 537 కేసులు నమోదు అయ్యాయి. ఇతర జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 15, బద్రాద్రి కొత్తగూడెం – 116, జగిత్యాల – 111, జనగామ – 39, జయశంకర్ భూపాలపల్లి – 56, జోగులాంబ గద్వాల – 69, కామారెడ్డి – 25, కరీంనగర్ – 172, ఖమ్మం – 245, కొమరంభీం ఆసిఫాబాద్ – 19, మహబూబ్‌నగర్ – 128, మహబూబాబాద్ – 98, మంచిర్యాల – 116, మెదక్ – 45, మేడ్చల్ మల్కాజిగిరి – 215, ములుగు – 58, నాగర్ కర్నూల్ – 132, నల్లగొండ – 187, నారాయణ పేట – 26, నిర్మల్ – 14, నిజామాబాద్ – 44, పెద్దపల్లి – 147, రాజన్న సిరిసిల్ల – 79, రంగారెడ్డి – 226, సంగారెడ్డి – 103, సిద్దిపేట – 104, సూర్యాపేట – 214, వికారాబాద్ – 103, వనపర్తి – 105, వరంగల్ రూరల్ – 87, వరంగల్ అర్బన్ – 146, యాదాద్రి భువనగిరి – 40 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Also read:

Gold River: నది ఒడ్డున పసిడి బురద..తీసుకున్నోళ్ళకి తీసుకున్నంత బంగారం..అదే వారి జీవనాధారం..ఎక్కడంటే..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే