Anandayya : ఆనందయ్యను నిర్బంధంలో ఉంచి ఎమ్మెల్యే కరోనా మందు చేయించుకుంటుంటే ఏం చేస్తున్నారు.? : సోమిరెడ్డి

Somireddy chandramohan reddy demands : ఆనందయ్య కరోనా మందును పేదలకు పంపిణీ చేయాలంటే ఆయుష్ క్లియరెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కావాలంటూ..

Anandayya : ఆనందయ్యను నిర్బంధంలో ఉంచి ఎమ్మెల్యే కరోనా మందు చేయించుకుంటుంటే ఏం చేస్తున్నారు.? : సోమిరెడ్డి
Tdp Team Visit Krishnapatna
Follow us

|

Updated on: May 25, 2021 | 8:44 PM

Somireddy chandramohan reddy demands : ఆనందయ్య కరోనా మందును పేదలకు పంపిణీ చేయాలంటే ఆయుష్ క్లియరెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కావాలంటూ అడ్డుకుంటున్నారు.. ఎమ్మెల్యే తన బంధుమిత్రులు, వ్యాపారస్తులకు ఇచ్చేందుకు మాత్రం ఈ అనుమతులు అవసరం లేదా…? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆనందయ్యకు భద్రత కల్పిస్తున్నామని బయటకు చెబుతూ ఆయనను నిర్బంధంలో ఉంచుకుని వేలాది మందికి మందు తయారు చేయించుకుంటారా.. అంటూ ఆయన ప్రశ్నించారు. దేవుడు లాంటి ఆనందయ్యను నిర్బంధంలో ఉంచి ఎమ్మెల్యే మందు చేయించుకుంటుంటే జిల్లాలో మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పొలిట్ బ్యూరో నిర్ణయం మేరకు టీడీపీ బృందం ఇవాళ కృష్ణపట్నంలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఈ సందర్బంగా సోమిరెడ్డి ముత్తుకూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి, ఆయన్న ఎందుకు నిర్భంధించాల్సి వచ్చిందంటూ జగన్ సర్కారుని నిలదీశారు.

కనీసం కృష్ణపట్నం వచ్చే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారన్న ఆయన, “సీఎం జగన్మోహన్ రెడ్డికి నాది ఒకటే విన్నపం.. అనధికారికంగా, నిర్బంధంలో తయారు చేయించి చీకట్లో పంపిణీ చేయించడం ఆపించండి.. ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించండి.” అంటూ డిమాండ్ చేశారు. కృష్ణపట్నం పర్యటనలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోపాటు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్.శివప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఏకొల్లు కోదండయ్య, తెలుగు యువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read also : Buddhadeb Bhattacharya : కరోనాతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య