AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yaas Cyclone: అతి తీవ్ర తుపానుగా మార‌నున్న ‘యాస్’.. ఏపీలో ప‌లు చోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్‌..

Yaas Cyclone: ఓవైపు దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంటే మ‌రోవైపు యాస్ పేరుతో తుపాను ముంచుకొస్తోంది. రానున్న 24 గంట‌ల్లో అతి తీవ్ర తుపానుగా మార‌నున్న‌ట్లు అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ శాఖ డైరెక్ట‌ర్ స్లెల్లా హెచ్చ‌రించారు...

Yaas Cyclone: అతి తీవ్ర తుపానుగా మార‌నున్న ‘యాస్’.. ఏపీలో ప‌లు చోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్‌..
Yaas Cyclone
Narender Vaitla
|

Updated on: May 25, 2021 | 8:40 PM

Share

Yaas Cyclone: ఓవైపు దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంటే మ‌రోవైపు యాస్ పేరుతో తుపాను ముంచుకొస్తోంది. రానున్న 24 గంట‌ల్లో అతి తీవ్ర తుపానుగా మార‌నున్న‌ట్లు అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ శాఖ డైరెక్ట‌ర్ స్లెల్లా హెచ్చ‌రించారు. యాస్ తుపాను పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంద‌ని.. భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్ల‌డించింది. పెను తుపానుగా మారి ఒడిశాలోని పారాదీప్, పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ఐలాండ్ మధ్య రేపు తీరం దాటే అవకాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్లు వరకు ఉండొచ్చని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ తుపాను కార‌ణంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

అధికారుల సూచ‌న‌లు..

అతి తీవ్ర తుపానుగా మార‌నున్న నేప‌థ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడి ఉంటుంద‌ని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేప‌థ్యంలో తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్ధితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విశాఖకు వెళ్లాలని ఆదేశించారు. తుపానుతో కోవిడ్ రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని సీఎం ఆదేశించారు. ఆక్సిజన్‌ ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్పత్రుల నుంచి కోవిడ్‌ రోగుల తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలని, తుపాను ప్రభావం మొదలు కాక ముందే వారిని తరలించాలని ఆదేశించారు.

రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో అమిత్‌షా స‌మావేశం..

ఇక తుపాను స‌న్న‌ద్ధ‌త‌పై ప్ర‌భావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తుపానుతో ఉత్పన్నమయ్యే పరిస్థితులు.. తీసుకోవాల్సిన చర్యలపై చ‌ర్చించారు. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని సీఎం జ‌గ‌న్ అమిత్‌షాకు తెలిపారు.

Also Read: బీజేపీని ఎదుర్కొనేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు ఇతర విపక్షాలతో ఎందుకు చేతులు కలపరు ? సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి

Little Boy: కటింగ్ చేయించుకుంటూ బుడ్డోడి ఏబీసీడీ పాట చూస్తే ఎవరైనా మెస్మరైజ్ కావలసిందే! Viral Video

Bangalore: కరోనా పేషెంట్స్ లో ఉత్సాహాన్ని నింపడానికి బెంగళూరులో వైద్యసిబ్బంది డ్యాన్స్..Viral Video

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..