Bangalore: కరోనా పేషెంట్స్ లో ఉత్సాహాన్ని నింపడానికి బెంగళూరులో వైద్యసిబ్బంది డ్యాన్స్..Viral Video
Bangalore: కరోనా మహమ్మారి చుట్టుముట్టేసింది. చాలామందిని చావుబతుకుల మధ్యలోకి తీసుకుపోయింది. ఇంకా తీసుకుపోతోంది. , మానవ చరిత్రను చెప్పేటప్పుడు కరోనా ముందు తరువాత అని చెప్పేంతగా కరోనా మన జీవితాలపై ప్రభావం చూపిస్తోంది.
Bangalore: కరోనా మహమ్మారి చుట్టుముట్టేసింది. చాలామందిని చావుబతుకుల మధ్యలోకి తీసుకుపోయింది. ఇంకా తీసుకుపోతోంది. , మానవ చరిత్రను చెప్పేటప్పుడు కరోనా ముందు తరువాత అని చెప్పేంతగా కరోనా మన జీవితాలపై ప్రభావం చూపిస్తోంది. కరోనా కారణంగా ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కరోనా సోకిన వారు ఆసుపత్రులలో కనీసం 14 రోజులు ఒంటరిగా గడపాల్సిన స్థితి. వారిని చూడటానికి నా అనేవారెవరూ వెళ్లలేరు. కనీసం పలకరించే ధైర్యం కూడా ఎవరూ చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ నేపధ్యంలో అక్కడ వారికి వైద్య సిబ్బందే బంధువులు.. స్నేహితులు. వైద్య సిబ్బంది ఇచ్చే మందులతో పాటు వారు చూపించే ఔదార్యమూ వారి ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తోంది.
కరోనా సోకడంతో ఆసుపత్రులలో వైద్య సహాయం పొందుతున్న వారిపట్ల వైద్య సిబ్బంది చాలా ఔదార్యం చూపిస్తూ వస్తున్నారు. వారు మానసికంగా కుంగిపోకుండా మేమున్నాం అంటూ ధైర్యం చెబుతున్నారు. కరోనాతో మంచం కదలలేని పరిస్థితుల్లో ఉన్న పేషెంట్స్ పట్ల వైద్య సిబ్బంది చూపిస్తున్న కరుణ చాలామంది కోలుకోవడానికి సహాయపడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా ఆసుపత్రులలో వైద్య సిబ్బంది తమ పేషెంట్లను ఉల్లాసంగా ఉంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అటువంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను డాక్టర్ అనంత కృష్ణన్ మురళీధరన్ నాయర్ బెంగళూరు నుంచి ట్వీట్ చేశారు. అందులో ఒక కోవిడ్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది రోజుల తరబడి ఆసుపత్రి బెడ్ లలో పడి ఉన్న తమ పేషెంట్స్ ను ఉత్సాహపరుస్తున్నారు. తమ డ్యాన్స్ తొ వారిని ఉల్లాస పరుస్తూ.. వారిని కూడా తమ శరీరం కదిలించేలా వ్యాయామం చేసేలా చేస్తున్నారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు..
So folks, lots of happy moments from #Bangalore today. First it was #halo over the skies. Now, doctors & nurses dancing to the tune of music at a #Covid ward to inspire patients. This is from CDSIMER Hospital here. #Positivity at its best.
[ Video via @NewsRaghav ?? ] pic.twitter.com/H1qXqjiyRe
— Dr Anantha Krishnan Muralidharan Nair ?? (@writetake) May 24, 2021
ఈ ట్వీట్ చేస్తూ డాక్టర్ అనంత కృష్ణన్ ”సోమవారం బెంగళూరులో సంతోషకరమైన అంశాలను చూశాము. ఒకటి సూర్యుడి చుట్టూ ఏర్పడిన వలయాలు అయితే, రెండోది కోవిడ్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్ల కోసం చేస్తున్న డాన్స్. పేషెంట్లను ఉల్లాసంగా ఉన్కాహ్డం కోసం చేస్తున్న వైద్యసిబ్బందికి అభినందనలు” అని పోస్ట్ చేశారు.