Viral Video: మండుటెండలో నడిరోడ్డుపై దాహంతో ఉన్న గద్దకు నీళ్లు అందించిన బాటసారులు.. నెటిజన్ల ప్రశంసలు
ప్రస్తుతం మే నెల చివరకు వచ్చింది. అంటే మండే ఎండలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో పక్షులు, అటవి జంతువుల పరిస్థితి దయనీయంగా మారింది.
ప్రస్తుతం మే నెల చివరకు వచ్చింది. అంటే మండే ఎండలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో పక్షులు, అటవి జంతువుల పరిస్థితి దయనీయంగా మారింది. అవి తీవ్రమైన కొరతను ఎదుర్కుంటున్నాయి. గతంలో ప్రభుత్వాలు, కొన్ని స్వచ్చంద సంస్థలు.. జంతు ప్రేమికులు.. వాటి నీటి అవసరాలను తీర్చడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుండేవారు. కానీ కరోనా వీరవిహారం చేస్తుండటంతో బయటకు వెళ్లేందకు జంకే పరిస్థితులు వచ్చాయి. తాజాగా దాహంతో ఉన్న ఓ గద్దకు బాటిల్‌తో నీరు అందించారు కొందరు బాటసారులు. హైవే పక్కన ఓ వ్యక్తి బాటిల్‌తో గద్దకు నీటిని తాగిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు దానిని నిశితంగా పరిశీలిస్తున్నారు. 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా తెగ సర్కులేట్ అవుతుంది.
Thirsty eagle..
Thank you! ? pic.twitter.com/ljmh7yMlDU
— Buitengebieden (@buitengebieden_) May 24, 2021
ఆ వీడియోకు దాహంతో ఉన్న గద్ద మీకు కృతజ్ఞతలు తెలుపుతోంది అని క్యాప్షన్ ఇచ్చాడు ఆ నెటిజన్. ఇప్పటికే భారీ లైక్స్, వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు గద్ద దాహం తీర్చిన వారికి థ్యాంక్స్ చెబుతున్నారు. ‘ఇంత గొప్ప పని చేసిన మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరో వ్యక్తి ‘మీ చేతులు అద్భుతాన్ని చేశాయి’ అని పేర్కొన్నారు.
Also Read: తినేటప్పుడు కూడా ఫోన్‌లో ముఖం పెట్టిన వ్యక్తి.. అతడి భార్య ఎలా తిక్క కుదిర్చిందో చూడండి