COVID-19 Test: కరోనా టెస్టు వద్దన్నందుకు యువకులపై దాడి.. దారుణంగా కొట్టిన ప్రభుత్వ సిబ్బంది.. వీడియో వైరల్..

Bengaluru boy brutally beaten by BBMP officials: దేశంలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను శరవేగంగా చేపడుతున్నాయి. కానీ కొన్నిచోట్ల ఇప్పటికీ కరోనా టెస్ట్‌లు చేయించుకోవటానికి జనాలు

COVID-19 Test: కరోనా టెస్టు వద్దన్నందుకు యువకులపై దాడి.. దారుణంగా కొట్టిన ప్రభుత్వ సిబ్బంది.. వీడియో వైరల్..
Bengaluru Boy Brutally Beaten By Bbmp Officials
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 25, 2021 | 12:50 PM

Bengaluru boy brutally beaten by BBMP officials: దేశంలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను శరవేగంగా చేపడుతున్నాయి. కానీ కొన్నిచోట్ల ఇప్పటికీ కరోనా టెస్ట్‌లు చేయించుకోవటానికి జనాలు ముందుకు రావటం లేదు. అటువంటి వారి పట్ల బెంగళూరు అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని నాగరత్‌పేట్ టెస్టింగ్ కేంద్రంలో టీకా కోసం వచ్చిన ఇద్దరు యువకులు చాలా సేపు లైన్‌లో వెయిట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత అది టీకా కేంద్రం కాదు, కొవిడ్ పరీక్షా కేంద్రం అని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అది గమనించిన బీబీఎంబీ సిబ్బంది.. వారిని టెస్టు చేయించుకోవాలని కోరారు. కోవిడ్‌ టెస్ట్‌ చేసుకునేందుకు ఆ యువకులు నిరాకరించారు. తమకు కోవిడ్ లక్షణాలు లేవంటూ ఓ యువకుడు అధికారులకు సమాధానం చెప్పాడు. అయినా.. ఆ సిబ్బంది వినిపించుకోకుండా యువకుడిని దారుణంగా కొట్టారు. ఒకరు పట్టుకుంటుంటే.. మరొకరు కొడుతూ వీడియోలో కనిపించారు.

వీడియో..

అయితే.. అక్కడే ఉన్న స్థానికులు కొందరు ఇదంతా వీడియో తీశారు. సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో ఈ విషయం కాస్తా పోలీసులకు చేరింది. యువకులపై చేయి చేసుకున్న అధికారులను గుర్తించి, వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయిన అనంతరం బృహత్ బెంగళూరు మహానగర్ పాలికమండలి (బీబీఎంపీ) స్పందించింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ కమిషనర్ క్షమాపణలు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. బెంగళూరు సిబ్బంది కావాలనే అత్సుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Lockdown: సంయమనం కోల్పోతున్న అధికారులు.. దుకాణదారుడిపై చేయి చేసుకున్న అదనపు కలెక్టర్.. వీడియో..

Covid-19: లాక్‌డౌన్ ఆంక్షల బేఖాతరు.. కోచింగ్ సెంటరులో 555 మంది విద్యార్థులు.. యజమాని అరెస్ట్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!