Lockdown: సంయమనం కోల్పోతున్న అధికారులు.. దుకాణదారుడిపై చేయి చేసుకున్న అదనపు కలెక్టర్.. వీడియో..
Additional Collector Slapping Shopkeeper: కరోనా కేసులు పెరుతుండటంతో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనల
Additional Collector Slapping Shopkeeper: కరోనా కేసులు పెరుతుండటంతో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనల అమల్లో అధికారులు సంయమనం కోల్పోతున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ సూరజ్‌పూర్ కలెక్టర్ ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపంచగా.. స్వయంగా ముఖ్యమంత్రే దీనిపై స్పందించి అతన్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది మరిచిపోకముందే..ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. దుకాణంలో ఉన్న ఓ వ్యక్తిపై అదనపు జిల్లా కలెక్టర్ దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాజాపూర్‌లో రెండు రోజుల క్రితం జరిగింది.
మధ్యప్రదేశ్ షాజాపూర్‌లో అదనపు జిల్లా కలెక్టర్ మంజూషా విక్రాంత్ రాయ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో షాజూపూర్ లోని ఓ ప్రాంతంలో చెప్పుల షాపు తెరిచి ఉండడాన్ని ఆమె గ్రహించారు. వెంటనే అక్కడకు చేరుకోని దుకాణదారుడితో మాట్లాడారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. ఆ దుకాణంలో ఉన్న వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిలో అదనపు జిల్లా కలెక్టర్ మంజూషా విక్రాంత్ రాయ్.. దుకాణదారుడిని ప్రశ్నిస్తుంటారు.. ఆ బాలుడు సమాధానం చెప్పేలోపే అతని తలపై కొడతారు. అనంతరం పోలీసులు కూడా ఆ బాలుడిని కర్రలతో కొడతారు. అనంతరం దుకాణాన్ని బంద్ చేయాలని చెప్పి వెళతారు. దీనిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఇందర్ సింగ్ స్పందించారు. కలెక్టర్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వీడియో..
MP: In a viral video, Shahajpur ADM was seen slapping a footwear shopkeeper, during the sealing of shops as a part of following #COVID19 lockdown guidelines
Shopkeeper says, “The shutter was down, still Policemen pulled it up. ADM slapped me & Policeman even hit me with stick.” pic.twitter.com/r1twTEn4nt
— ANI (@ANI) May 24, 2021
కాగా.. ఈ ఘటనపై దుకాణదారుడు మాట్లాడుతూ.. పోలీసులను చూసే దుకాణం షట్టర్‌ను బంద్ చేశానని తెలిపాడు. అనంతరం పోలీసులు దాన్ని పైకి లాగారని.. వివరణ చెప్పేలోపే తనను ఏడీఎమ్ చెంపదెబ్బ కొట్టారని.. పోలీసులు కూడా కొట్టారని తెలిపాడు.
Also Read: