Volcanic Eruption: కాంగో అగ్నిపర్వతం విస్ఫోటనం.. 32కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయచర్యలు

కాంగో దేశంలో అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలను కోల్పోయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

Volcanic Eruption: కాంగో అగ్నిపర్వతం విస్ఫోటనం.. 32కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయచర్యలు
Volcanic Eruption In Congo
Follow us
Balaraju Goud

|

Updated on: May 25, 2021 | 9:41 AM

Volcanic Eruption in Congo: కాంగో దేశంలో అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలను కోల్పోయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. కాంగో దేశంలోని గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. గోమాకు ఉత్తరాన ఉన్న ప్రదేశంలో లావాను చల్లబరుస్తుండగా ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు. మరో వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరారని పౌర సమాజ నాయకుడు మాంబో కవాయ చెప్పారు. అగ్నిపర్వతం నుంచి ప్రవహించిన లావా ఇళ్లను ముంచెత్తడంతో 9 మంది దహనమయ్యారు. అగ్నిపర్వతం పేలడంతో గోమా జైలు నుంచి ఖైదీలను తరలిస్తుండగా ట్రక్కు బోల్తా పడింది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న 14మంది దుర్మరణం పాలయ్యారు. కాంగో దేశ అధికారులు సహాయ పునరావాస పనులు చేపట్టారు.

తూర్పు కాంగోలో రెండు రోజుల క్రితం మౌంట్ నైరాగోంగో అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించింది. తూర్పు నగరమైన గోమా శివార్లలో ఈ ఘటన జరిగింది. వెదజల్లిన లావా గ్రామంలోని 500కి పైగా గృహాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 32కి పెరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఉత్తర కివు ప్రావిన్స్ సివిల్ ప్రొటెక్షన్ హెడ్ జోసెఫ్ మకుండి తెలిపారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు డజనుకు పైగా ప్రజలు కారు ప్రమాదాల్లో మరణించారు. కాంగో ఆరోగ్య మంత్రితో సహా ప్రభుత్వ మంత్రుల ప్రతినిధి బృందం గోమాకు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

సుమారు 2 మిలియన్ల జనాభా కలిగిన గోమా శివారులో అగ్నిపర్వతం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో సుమారు 5,000 మంది ప్రజలు సమీప సరిహద్దు మీదుగా రువాండాలోకి పారిపోయారు. మరో 25 వేల మంది సాకేలో వాయువ్య దిశలో ఆశ్రయం పొందారని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఒకరు తెలిపారు.

Read Also…  Yaas Cyclone: వాయువేగంతో దూసుకువస్తున్న యాస్ తుఫాన్.. ప్రభావిత ప్రాంతాల్లో టెన్షన్.. టెన్షన్

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.