Lunar Eclipse 2021: రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏ సమయంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది..? 2021లో సంభవించే గ్రహణాలు ఇవే
Lunar Eclipse 2021: ఆకాశంలో రేపు అద్భుతం జరగబోతోంది. అలాంటి అద్భుతాలను చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాదిలో నాలుగు గ్రహాలు సంభవించనున్నాయి...
Lunar Eclipse 2021: ఆకాశంలో రేపు అద్భుతం జరగబోతోంది. అలాంటి అద్భుతాలను చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాదిలో నాలుగు గ్రహాలు సంభవించనున్నాయి. ఇందులో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు. రెండు గ్రహణాలు మాత్రమే భారత్ లో కన్పిస్తాయంటున్న ఖగోళ శాస్త్ర వేత్తలు. ఈ సంవత్సరపు మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం 26వ తేదీన రాబోతోంది. ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ (ఎర్ర చందమామ) అని కూడా అంటున్నారు. ఎందుకంటే.. చంద్రగ్రహణం సమయంలో చందమామ ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తుంది. చంద్రగ్రహణ కాలము చంద్రుడి స్థాన కక్ష్యాబిందువులపై ఆధారపడి వుంటుంది. ఈ గ్రహణాన్ని భారత్ లో పశ్చిమ బెంగాల్, సిక్కి మినహా మిగతా ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా లో కన్పిస్తుంది. ఇతర దేశాల్లో ఈశాన్య ఆసియా దేశాలు, తూర్పు ఆసియా దేశాలు, పసిఫిక్ మహా సముద్రం, ఉత్తర, దక్షిణా అమెరికాలోని కొన్ని దేశాల్లో,ఆస్ట్రేలియా, అంటార్కిటికాలో కన్పించనుంది. అయితే భారత్‌లో అయితే గ్రహణ సమయాలు.. మధ్యాహ్నం 2.17 గంటలకు ప్రారంభం.. రాత్రి 7.19 గంటలకు పూర్తవుతుంది. అలాగే కోల్ కతాలో పాక్షిక గ్రహణం 3.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.22 గంటలకు పూర్తవుతుంద. గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా మారనున్నాడు. దీన్ని సూపర్ బ్లడ్ మూన్ గా పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు.
ఆ రంగుల్లో ఎందుకు కనిపిస్తుంది..?
సూర్యుడికి చంద్రునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకిరణాలు చంద్రుడిపై పడవు. ఆ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది. ఐతే సూర్యకిరణాల్లోని ఎరుపు, నారింజ రంగు కిరణాలు భూమి నుంచి ముందుకు దూసుకెళ్తాయి. అవి చందమామపై ప్రసరిస్తాయి. అందువల్ల చందమామ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు ఈ గ్రహణం సంభవిస్తుంది. పౌర్ణమి రోజుల్లోనే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమి ఛాచాయ(నీడ) పరిధిలో ఉండే ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి యొక్క నీడలోకి ప్రవేశించినపుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
2021లో నాలుగు గ్రహణాలు:
మే 26 – సంపూర్ణ చంద్రగ్రహణం జూన్ 10- వార్షిక సూర్యగ్రహణం నవంబర్ 19- పాక్షిక చంద్రగ్రహణం డిసెంబర్ 4- సంపూర్ణ సూర్యగ్రహణం
సూపర్ బ్లడ్ మూన్ అంటే…
సాధారణంగా భూమి చంద్రుల మద్య సరాసరి దూరం 384440 కి మీ. ఈ గ్రహణ సమయంలో భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరిగే చంద్రుడు, భూమికి సమీపంలోకి 356509 కి.మీ వస్తాడు. ఈ దూరాన్ని ‘పెరిగి’ అంటారు. భూమి చంద్రుల మద్య దూరం పెరిగినప్పుడు అది 406662 కి.మీ ఉంటుంది. దీన్ని ‘అపోగి’ అంటారు. భూమికి, చంద్రుడు అత్యంత సమీపంలో (పెరిగి) లో ఉన్నప్పడు సూపర్ మూన్ చెబుతారు. అప్పుడు చంద్రుడు మామూలు కంటే 14 రెట్టు పెద్దగా, 30 రెట్లు ఎక్కువ ప్రకాశంతో కన్పిస్తాడు. ఈ సూపర్ మూన్ దశలో ఏర్పడే గ్రహణ సమయంలో కన్పించే చంద్రుడిని ‘సూపర్ బ్లడ్ మూన్’ గా పిలుస్తారు.
ఇవీ కూడా చదవండి:
Jackfruit: పనస పండు వల్ల అద్భుతమైన ఉపయోగాలు.. రోగనిరోధక శక్తి పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్న నిపుణులు
Diabetic: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా..? మీ రోజు వారీ ఆహారంలో వేరుశనగలు జోడించండి..!