Diabetic: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా..? మీ రోజు వారీ ఆహారంలో వేరుశనగలు జోడించండి..!

Diabetic: డయాబెటిస్‌.. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే మధుమేహం రావడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా వంశపారపర్యంగా..

Diabetic: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా..? మీ రోజు వారీ ఆహారంలో వేరుశనగలు జోడించండి..!
Peanuts
Follow us

|

Updated on: May 22, 2021 | 3:28 PM

Diabetic: డయాబెటిస్‌.. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే మధుమేహం రావడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా వంశపారపర్యంగా, ఒత్తిడి, మానసిక ఇబ్బందులు, టెన్షన్‌కు గురికావడం తదితర సమస్యల వల్ల ఈ మధుమోహం బారిన పడుతుంటారు. అయితే డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలు, ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది. కానీ ప్రస్తుతం తినే ఆహారం వల్ల మధుమేహం బారిన పడే వారి సంఖ్య పెరగడమే కాకుండా అదుపులో లేకుండా పోతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఆహార నియమాలను మార్చుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక డయాబెటిస్‌ అందుపులో ఉండేందుకు వేరుశనగ ఎంతగానో ఉపయోగపడుతుంది. డయాబెటిస్‌ టైప్‌ 2 ఉన్నవారు వేరు శనగ తినడం వల్ల అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇందులో మాంగనీస్‌, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వు మరియు కార్బోహైడ్రేట్‌ల విషయంలో ముఖ్య పాత్ర పోషించి మెటబాలింకు సహాయపడాతాయి. క్యాల్షియం గ్రహించడం మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. ఎవరైతే డయాబెటిస్‌తో బాదపడుతున్నారో వారు కొద్దిగా పల్లీలు తినడం అలవాటు చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 2018లో జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రచురించిన అధ్యయనంలో పల్లీలు వారానికి ఐదు సార్లు తినే మహిళలు టైప్‌ -2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని గుర్తించారు.

వేరుశనగల్ని రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే ఉప్పునీళ్లలో ఉడికించుకుని తింటే ఎంతో మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్థుల నుంచి గుండెజబ్బులున్న వాళ్ల వరకు ఈ వేరుశనగలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే బాదం, పిస్తా లాంటి నట్స్ లో కన్నా కూడా వేరుశనగల్లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళలకైతే ఇవి పోషక భాండాగారాలే. మహిళల ఆరోగ్యానికి ఇనుము, ఫోలిక్ ఆమ్లం చాలా ముఖ్యం. ఈ రెండు పోషకాలే కాకుండా ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం కూడా పల్లీల్లో ఎక్కువే. గుప్పెడు వేరుశనగలతో డయాబెటిస్ ను కూడా దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రత్యేకించి డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజూ వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న వేరుశనగల్ని ఇక రోజూ తీసుకోండి మరి.

ఇవీ చదవండి:

Heart Pain: గుండెనొప్పి వచ్చిన వారికి మొదటి గంట సమయమే ముఖ్యం.. లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువ..!

Children Covid-19: పిల్లల్లో కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి..? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివే..!