Covid-19: లాక్‌డౌన్ ఆంక్షల బేఖాతరు.. కోచింగ్ సెంటరులో 555 మంది విద్యార్థులు.. యజమాని అరెస్ట్..
Gujarat Coaching Centre Raid: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం నాలుగువేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోతుండగా.. లక్షలాది మంది
Gujarat Coaching Centre Raid: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం నాలుగువేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోతుండగా.. లక్షలాది మంది కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. ఈ లాక్‌డౌన్ ను కొంతమంది అస్సలు పట్టించుకోవడం లేదు. అన్ని చోట్ల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. తాజాగా.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కోచింగ్ సెంటరులో 555 మంది విద్యార్థులను ఉంచిన యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లాలోని జస్దాన్ పట్టణంలో జరిగింది.
రాజ్‌కోట్ జిల్లాలోని జస్దాన్ పట్టణంలోని జయసుఖ్ సంఖల్వాగా కోచింగ్ సెంటరుపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలకు విరుద్ధంగా 555 మంది విద్యార్థులను ప్రాంగణంలో ఉన్నట్లు తేలిందని రాజ్ కోట్ ఎస్పీ బలరామ్ మీనా చెప్పారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన జయసుఖ్ పై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు. అనంతరం కోచింగ్ సెంటరులోని విద్యార్థులను.. వారి తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్పీ పేర్కొన్నారు.
జవహర్ నవోదయ విద్యాలయ, బాలచాడి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సంకల్వ కోచింగ్ సెంటర్-కమ్-హాస్టల్ నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కోచింగ్ సెంటర్‌లో 9 నుంచి 10 ఏళ్ల వయసు గల విద్యార్థులు మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా తరగతి గదుల్లో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Also Read: