Coronavirus: విషాదం.. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కరోనాతో మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కరోనాతో క‌న్నుమూశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Coronavirus:  విషాదం.. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కరోనాతో మృతి
Collector Died
Follow us
Ram Naramaneni

|

Updated on: May 25, 2021 | 6:50 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కరోనాతో క‌న్నుమూశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంజయ్య మృతిపట్ల పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాకు ఉత్తమ సేవలందించిన అంజయ్య మరణించారనే వార్తతో జిల్లా ప్రజలు విషాదంలో మునిగిపోయారు. అంకిత భావంతో జిల్లాకు సేవలందించి అందరి మన్ననలు, ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.

ఈ నెల 28 నుంచి సూపర్ స్పైడర్లకు టీకాల పంపిణీ

తెలంగాణ‌లో క‌రోనా వ్యాక్సినేషన్​ను ప్రభుత్వం వేగవంతం చేసింది. సూపర్ స్ప్రెడర్లను గుర్తించడం కోసం విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలతో… మంత్రి హరీశ్‌రావు అధికారులతో చ‌ర్చించారు. దాదాపు 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ఈ నెల 28 నుంచి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. మొదట జీహెచ్​ఎంసీలోని బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, హోటల్స్, సెలూన్లు, కూరగాయల వ్యాపారులకు విడతల వారీగా వ్యాక్సిన్ వేయనున్నారు. కిరాణా దుకాణాదారులు, హమాలీలకు సైతం టీకాలు వేయాలని నిర్ణయించారు.

దేశ‌వ్యాప్తంగా ప‌నిచేస్తోన్న‌ కరోనా కట్టడి ఆంక్ష‌లు

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లు తాజా ప‌రిస్థితిని చూస్తే అర్థ‌మవుతంది. కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వాటి సంఖ్య రెండు లక్షల దిగువకు చేరింది. రోజూవారీ కేసుల తగ్గుదలతో పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. ప్రజంట్ అది 9.54 శాతంగా ఉందని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. అలాగే వరసగా 12వ రోజు కూడా పాజిటివ్‌ కేసులు కంటే రికవరీలే అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

Also Read: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

క‌రోనా కార‌ణంగా ఏపీలో కొత్త‌గా 106 మరణాలు… పాజిటివ్, యాక్టివ్ కేసుల వివ‌రాలు ఇలా ఉన్నాయి