Congress PAC Meeting: ఎందుకు, ఏమిటి, ఎలా? హుజురాబాద్ బైపోల్ ఘోర పరాజయంపై కాంగ్రెస్ పోస్ట్‌మార్టమ్..
గాంధీభవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. గతంలో ఎప్పుడూలేని విధంగా దారుణమైన ఓటమి ఎదురవడంపై సీనియర్లంతా సీరియస్‌గా ఉన్నారు.
T Congress PAC Meeting: గాంధీభవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. గతంలో ఎప్పుడూలేని విధంగా దారుణమైన ఓటమి ఎదురవడంపై సీనియర్లంతా సీరియస్‌గా ఉన్నారు. అన్ని వేళ్లు రేవంత్ రెడ్డివైపే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభమైన PAC మీటింగ్ హాట్‌హాట్‌గా సాగుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, హనుమంతరావు, సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ హాజరయ్యారు.
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ ఘరో పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో ఓటమికి గల కారణాలను పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ విశ్లేషించనున్నారు. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కావడమే కాదు.. మరీ దారుణంగా కేవలం 3 వేల ఓట్లే వచ్చాయి. ప్రత్యర్ధులతో బలమైన పోరాటం చేయాల్సిన వాళ్లు కాస్తా.. వాళ్లలో వాళ్లే అంతర్గత పోరాటానికి తెర లేపిన బలహీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎప్పటిలాగానే తన మైనస్ పాయింట్లు తానే బజార్నపడేసుకున్న దృశ్యం కళ్లకు కట్టింది. తొలి రౌండ్ల నుంచే కాంగ్రెస్ మార్క్ రివర్స్ పంచ్ పేలింది. కేడరున్నా ఓట్లు వేయించుకోదగ్గ లీడర్ లేక పోయాడంటూ ఆ పార్టీ సీనియర్ నేతలే నిరసన స్వరం వినిపించారు. బల్మూరి వెంకట్ ను బలి పశువును చేశారని స్థానిక నాయకత్వాన్ని ఉతికి ఆరేశారు..
ఇదిలావుంటే, హుజురాబాద్‌లో ఘోర పరాభవం చర్చించేందుకు సమావేశమైన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో రచ్చ మామూలుగా లేదు. జానారెడ్డి సాబ్ అలా వచ్చారు .. ఇలా వెళ్లిపోయారు.! ఆయన ఎందుకు వచ్చారో.. ఎందుకు వెళ్లిపోయారో ఎవరికీ తెలియదు.! తాడోపేడో తేల్చుకుందాం.. వెళ్లిపోవద్దూ అంటూ మరో సీనియర్ వీహెచ్ వారించినా జానారెడ్డి విన్లేదు.
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో రచ్చ మామూలుగా లేదు. జానారెడ్డి సాబ్ అలా వచ్చారు .. ఇలా వెళ్లిపోయారు.! ఆయన ఎందుకు వచ్చారో.. ఎందుకు వెళ్లిపోయారో ఎవరికీ తెలియదు.! తాడోపేడో తేల్చుకుందాం.. వెళ్లిపోవద్దూ అంటూ మరో సీనియర్ వీహెచ్ వారించినా జానారెడ్డి విన్లేదు. ఇక ఇది టైమ్ కాదంటూ మరో సీనియర్ రేణుకా చౌదరి వారించారు.
మీటింగ్ నుంచి బయటకు వచ్చిన జానారెడ్డిని చుట్టుముట్టింది మీడియా. లోపల ఏం జరిగిందని ప్రశ్నించింది. కానీ ఆయన మాత్రం వెటకారంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెప్పివెళ్లిపోయారు.. ఇక మీటింగ్‌కు లేట్‌గా వచ్చినా లెటెస్ట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. ఇకపై అంతాగప్‌చుప్ అన్నారు. నా నియోజకవర్గంపై ఫోకస్ పెడుతా.. 2023 వరకు పార్టీ వ్యవహారాలపై మాట్లడనని స్పష్టం చేశారు. హుజురాబాద్ బైపోల్‌పైనా సెటైర్లు పేల్చారు.. మాణిక్కం ఠాగూర్‌కు ఏమీ తెలియదన్నారు జగ్గారెడ్డి. హుజురాబాద్ ప్రచారానికి స్టార్లు పోతేనే ఓట్లు పడలేదు.. తాను పోతే పడుతాయా అంటూ ప్రశ్నించారు.
ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నేత విహెచ్ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. మీడియా ముందు మాట్లాడొద్దు అంటారు .. ఎవరికి ఇష్టం వొచ్చినట్లు వాళ్ళు బయట మాట్లాడతారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో బీసీని కానీ, ఎస్సీని కానీ నిలబెడితే ఫలితం వేరేలా ఉండేదన్నారు. అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదని హనుమంతరావు మండిపడ్డారు. వీహెచ్ అడుగుతున్న ప్రశ్న లకు నేతలంతా సైలెంట్ అయ్యారు. గతంలో హుజుర్‌నగర్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, నాగార్జునసాగర్‌లపై ఎలాంటి రివ్యూ జరగడం లేదన్న వీహెచ్.. ఓటములపై సమీక్ష జరగకపోవడం వల్లే ఈ రోజు హుజురాబాద్ పరిస్థితి నెలకొందన్నారు. ఓటములపై గుణపాఠం నేర్చుకోవాలని వీహెచ్ సూచించారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ గరం గరంగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సమవేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి మధ్య హాట్ హాట్‌గా డిబేట్ జరిగింది. ఖమ్మం జిల్లాలో భట్టి అనవసరమైన చర్యలతో సమస్యలు వస్తున్నాయని రేణుకాచౌదరి ఆరోపించారు. రేణుకాచౌదరి మాటలతో.. విభేదిస్తూ తాను సీఎల్పీ లీడర్ ను అని భట్టి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సీఎల్పీ అయితే సమస్యలు పరిష్కరించాలే కానీ సృష్టించ వద్దన్న రేణుక.. పర్ఫార్మెన్స్ పెరగాలే కానీ జీరో ఉండొద్దని ఘాటుగా మాట్లాడారు. రేణుక మాటలకు భట్టి.. ఏం మాట్లాడకుండా మౌనం దాల్చారు.
Read Also… Etela Rajender: తెలంగాణ కమలదళంలో నూతనోత్సాహం.. ఈటల గెలుపునకు కలిసొచ్చిన కారణాలేంటి?