Save Banyans of Chevella: మర్రిచెట్లను కాపాడుకునేందుకు వేలాది మంది ప్రకృతి ప్రేమికుల సమావేశం.. ఎక్కడంటే..
చెట్లను నరికేయడం, అడవులను నిర్మూలించడం వల్ల పలు పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు..
చెట్లను నరికేయడం, అడవులను నిర్మూలించడం వల్ల పలు పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రకృతిని కాపాడుకునేందుకు కొందరు పర్యావరణ ప్రేమికులు తమదైన శైలిలో పోరాటం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా మొక్కల సాగును ప్రోత్సహిస్తూ, అడువుల నరికివేతకు వ్యతిరేకంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో చేవెళ్ల సమీపంలో తాజాగా వేలాది మంది ప్రకృతి ప్రేమికులు సమావేశమయ్యారు.
మర్రిచెట్లకు పూజలు.. చేవెళ్లతో పాటు హైదరాబాద్ మన్నెగూడ రహదారికి ఇరువైపులా దాదాపు 10వేలకు పైగా మర్రిచెట్లు ఉన్నాయి. ఇవి కొన్ని దశాబ్దాలుగా ఎంతోమందికి నీడ నిస్తున్నాయి. అయితే ఇటీవల మన్నెగూడ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో ఈ చెట్ల నరికేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రకృతి ప్రేమికులు ఈ విషయం తెలుసుకుని ‘Save Banyans of Chevella’ పేరుతో సోషల్ మీడియాలో ఓ పేజీని ప్రారంభించారు. మర్రి చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా అందులో స్థానికులు, ఆ మార్గంలో నిత్యం తిరిగే వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇక రహదారి విస్తరణకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా పలువురు ప్రకృతి ప్రేమికులు మంగళవారం సమావేశమయ్యారు. మర్రిచెట్ల నరికివేతకు వ్యతిరేకంగా రూపొందించాల్సిన కార్యాచరణపై అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మర్రిచెట్ల దగ్గర దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశాబ్దాలుగా ఉన్న ఈ చెట్లను ఎలాగైనా కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. పెయింటింగ్స్, పోస్టర్లను ప్రదర్శించారు. చెట్లకు దారాలు కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ సమావేశంలో సుమారు 2వేల మంది ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు.
Also Read:
TSRTC Bus Pass: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్..!
Air Gun: రోడ్డు ప్రమాదం మృతుని వద్ద ఎయిర్ గన్.. ఉలిక్కిపడ్డ నిర్మల్ జిల్లా పోలీసులు!