AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Rajender: తెలంగాణ కమలదళంలో నూతనోత్సాహం.. ఈటల గెలుపునకు కలిసొచ్చిన కారణాలేంటి?

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన ఫలితాలు రానే వచ్చాయి. పోలింగ్ వరకు నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వం సాగితే.. రిజల్ట్స్ మాత్రం వార్ వన్ సైడే అన్నట్లుగా వెలువడ్దాయి.

Etela Rajender: తెలంగాణ కమలదళంలో నూతనోత్సాహం.. ఈటల గెలుపునకు కలిసొచ్చిన కారణాలేంటి?
Etela Rajender
Balaraju Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 03, 2021 | 11:48 AM

Share

Etela Rajender Victory in Huzurabad: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన ఫలితాలు రానే వచ్చాయి. పోలింగ్ వరకు నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వం సాగితే.. రిజల్ట్స్ మాత్రం వార్ వన్ సైడే అన్నట్లుగా వెలువడ్దాయి. ఎంతో ఉత్కంఠ భరితంగా ప్రారంభమైన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. రౌండ్ రౌండ్‌లో ఈటలకు మెజార్టీ పెరిగిందే తప్ప.. ఎక్కడా తగ్గలేదు. వెరసి ప్రధాన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై భారీ మెజార్టీ విజయ దుందుభి మోగించారు.

అయితే, ఈటల రాజేందర్‌ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగినా తన వ్యక్తిగత ఇమేజ్‌తోనే విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో ఈటలను ఎలాగైనా ఓడించాలన్న పంతంతో కేసీఆర్ వ్యూహరచన చేశారు. రాత్రికి రాత్రే లక్షలు కురిపించే పథకాలకు రూపకల్పన చేశారు. కానీ ఆ ఎత్తులేమీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పారలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న పథకాలతో పాటు హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని భావించింది. అయితే దశాబ్దానికి పైగా నియోజకవర్గానికి తాను చేసిన సేవలను గుర్తు చేస్తూ ఈటల రాజేందర్ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తనను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవిధంగా అవమానాలపాలు చేసిందో బహిరంగంగా వెల్లడించారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన ఏ విధంగా ఉందో చెబుతూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాన్ని ఈటల చేశారు.

నిజానికి హుజూరాబాద్ ఉప ఎన్నికను కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా మార్చాలని ఈటల భావించారు. అయితే టీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికను బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రణాళిక వేసింది. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఈటల బయటపడిన తరువాత ఎంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈటలను.. కేసీఆర్ సర్కారు వేధింపులకు గురిచేస్తున్నదనే సంకేతం ప్రజల్లోకి వెళ్లింది. టీఆర్‌ఎస్‌ పార్టీలో తొలినుంచి కీలకంగా వ్యవహరించిన ఈటల తనకు జరిగిన అవమానాలను ప్రజల ముందు వెళ్లగక్కడంతో సానుభూతి మరింత పెరిగింది. పైగా గత నాలుగు దఫాల అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఈటల గెలుపొందడం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌కు అద్దం పడుతుంది. అలాగే ఈటల తన నియజవర్గం అభివృద్ధికి ఎంతనాగో పాటుపడ్డారనే భావన ప్రజల్లో నాటుకుంది.

మరో అంశం.. ఈటల రాజేందర్‌కు మండలంలోని గోపాల్‌పూర్ పంచాయతీ పరిధిలోని బత్తినివానిపల్లి గ్రామంతో ఎంతో అనుబంధం ఉంది. ఈ గ్రామం అన్న, ఆ ఊరి వారన్న ఈటలకు ఎనలేని అభిమానం. బత్తినివానిపల్లి అంటే ఆయనకు ప్రత్యేక సెంటిమెంట్. ప్రతి ఎన్నికల్లో ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించడం అనవాయితీగా వస్తోంది. ఇక్కడి అంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తే గానీ ఏ కొత్త కార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో హుజురాబాద్ ఉప ఎన్నికకు కూడా ఇక్కడే ప్రత్యేక పూజలు చేసిన ఎన్నికల ప్రచారం ప్రారంభిచారు. అంతకుముందు చేపట్టిన పాదయాత్ర సైతం ఈ ఆలయంలో పూజలు చేసిన తర్వాతనే మొదలుపెట్టారు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఈశాన్య దిక్కున ఉన్న ఈ గ్రామం.. కమలాపూర్ మండలానికి చివరగా ఉండటంతో పాటు వరంగల్, కరీంనగర్ రెండు జిల్లాలు, రెండు నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉండటం విశేషం.

వాస్తవానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బలం నామమాత్రమే. 2018 ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థికి 1683 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కంటే స్వతంత్ర అభ్యర్థికి, నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. తాజా ఉప ఎన్నికల్లో పార్టీ బలం వల్ల ఈటల గెలిచారా..? లేక వ్యక్తిగత ఇమేజ్ కారణంగా విజయం సాధించారా..? అన్నది చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణే చాలు. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మొదటి నుంచీ బీజేపీ బలం నామమాత్రంగానే ఉంది. ఈటల చేరికతో ఆ పార్టీ బలం ఒక్కసారిగా పెరిగిందని చెప్పొచ్చు. దీంతో బీజేపీ కంటే ఈటలను చూసే ఓట్లు వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీఆర్ఎస్‌కు గత ఏడాది నవంబర్‌లో దుబ్బాక ఎన్నికల రూపంలో బ్రేకులు పడడం, ఈ ఏడాది మళ్లీ హుజూరాబాద్ ఉప ఎన్నికల రూపంలో గట్టి దెబ్బే తగిలింది. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్‌లో అంతర్మథనం మొదలైంది. ఎక్కడ లోపం ఉంది, దేనివల్ల ఇలా జరుగుతోంది అనే అంశాలపై కసరత్తు ప్రారంభమైంది.

Read Also…  Etela Rajender Press Meet: ఈటెల సంచలన ప్రెస్ మీట్..! హుజూరాబాద్‌లో గెలుపుతో బీజేపీ సంబరాలు.. (లైవ్ వీడియో)

Huzurabad TRS: సంక్షేమ పథకాలే సర్కార్ బలం.. ఈటల గెలుపు ఎలా సాధ్యం? ఓడిన టీఆర్ఎస్‌లో అంతర్మథనం!

Huzurabad By Poll: దమ్ముంటే డిపాజిట్ తెప్పించు అన్న పార్టీలో అదే జరిగింది.. హుజురాబాద్‌లో డీలాపడ్డ కాంగ్రెస్

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!