Telangana Congress: టీ కాంగ్రెస్‌లో మంటలు చల్లారేనా..? రెండు రోజుల్లో తెలంగాణకి ఇంచార్జ్‌ మాణిక్‌రావు థాక్రే..

మాణిక్యం ఎగ్జిట్‌..మాణిక్‌ ఎంట్రీ తర్వాత టి కాంగ్రెస్‌లో చెలరేగిన తుఫాన్‌ సద్దుమణుగుతుందా..? సీనియర్‌ నేతల కోపం చల్లారుతుందా..? ఎంతో అనుభవం ఉన్న నేతగా థాక్రే..

Telangana Congress: టీ కాంగ్రెస్‌లో మంటలు చల్లారేనా..? రెండు రోజుల్లో తెలంగాణకి ఇంచార్జ్‌ మాణిక్‌రావు థాక్రే..
Manikrao Thakre
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 05, 2023 | 10:02 AM

మాణిక్యం ఎగ్జిట్‌..మాణిక్‌ ఎంట్రీ తర్వాత టి కాంగ్రెస్‌లో చెలరేగిన తుఫాన్‌ సద్దుమణుగుతుందా..? సీనియర్‌ నేతల కోపం చల్లారుతుందా..? ఎంతో అనుభవం ఉన్న నేతగా థాక్రే , టికాంగ్‌లోని గ్రూప్‌ తగాదాలకు చెక్‌ పెడతారా? అనేది ఆసక్తి కరంగా మారింది. మరో రెండ్రోజుల్లో తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్‌ కొత్త ఇంఛార్జి మాణిక్‌రావు, వ్యూహం ఎలా ఉండబోతోంది? సీనియర్‌ నేతలను ఎలా కన్విన్స్‌ చేయనున్నారు? అంతా ఒకతాటిపై ముందుకు తీసుకెళ్తారా..? అనే టాక్‌ గాంధీభవన్‌వర్గాల్లో వినిపిస్తోంది.

మరోవైపు మాణిక్కం తప్పుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి సీనియర్ల ఫిర్యాదులు.. మరొకటి పొత్తుల అంశం. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కలిసివెళ్లేలా కొందరు సీనియర్ల పట్టుబట్టినట్లు తెలుస్తోంది. BRSతో కలిసివెళ్తే 40 సీట్లతో పాటు ఫండింగ్ కూడా వస్తుందని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను మాణిక్కంతోపాటు.. రేవంత్‌వర్గం కూడా వ్యతిరేకించింది.

అటు రాహుల్ కూడా BRSతో దోస్తీని తోసిపుచ్చారు. ఈ ఎపిసోడ్‌లోనే మాణిక్కం హర్ట్ అయ్యారన్న వాదనలున్నాయి. ఉదయం ఆయన చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సరైన క్షణాల కోసం ఓపికగా వేచిచూడటం అనేది.. జీవితంలో అత్యంత విషమ పరీక్ష అన్నది ఆ ట్వీట్‌ సారాంశం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..