Hyderabad: అయ్యో ఏం కష్టమొచ్చిందమ్మా..! ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకిన వృద్ధురాలు.. చివరకు..

Erragadda Metro Station: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి ఓ వృద్ధురాలు

Hyderabad: అయ్యో ఏం కష్టమొచ్చిందమ్మా..! ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకిన వృద్ధురాలు.. చివరకు..
Erragadda Metro Station
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 04, 2023 | 1:25 PM

Erragadda Metro Station: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి ఓ వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడింది. మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించిన మహిళ.. ఆ తర్వాత పైనుంచి కిందకు దూకింది. దీంతో ఆమె తీవ్రగాయలతో అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధురాలు మారెమ్మగా (70) గుర్తించారు.

మారెమ్మ స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ అని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే మారెమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అసలు ఆమె హైదరాబాద్‌ ఎందుకొచ్చింది.. ఏ కారణంతో ఆత్మహత్య చేసుకుంది.. అనే వివరాలపై ఆరా తీస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సనత్‌ నగర్‌ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, మహిళ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..