Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekend Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే దీనిని స్కిప్ చేయొద్దు.. బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ మీ కోసం..

మీరు హైదరాబాద్ నివాసితులైతే మీకు దగ్గరలోనే మంచి టూరిస్ట్ స్పాట్ ఉంది. కేవలం రెండు గంటల ప్రయాణ దూరంలోనే ఉంది. అదే అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవైన కోమటి చెరువు.

Weekend Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే దీనిని స్కిప్ చేయొద్దు.. బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ మీ కోసం..
Komati Cheruvu Suspension Bridge 1
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 04, 2023 | 5:55 PM

వీకెండ్ కి దగ్గరలోనే ఏదైనా మంచి టూరిస్ట్ స్పాట్ కి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఒక రోజులో వెళ్లి వచ్చేంత దూరం ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు హైదరాబాద్ నివాసితులైతే మీకో మంచి టూరిస్ట్ స్పాట్ ఉంది. కేవలం రెండు గంటల ప్రయాణ దూరంలోనే ఉంది. అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవైన కోమటి చెరువు మీరు చూడకపోతే చాలా మిస్ అవుతారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం దీనిని మంచి పర్యాటక ప్రాంతంగా అభివ‌ృద్ధి చేసింది. అక్కడ ప్రకృతి రమణీయతతోపాటు, ఫుడ్ లవర్స్ కోసం విభిన్నరుచులతో ఆహార పదార్థాలు, సాహసాలను ఇష్టపడే వారికి స్కై సైక్లింగ్ వంటివి ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్న విశేషాలు, ఆసక్తికర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అన్ని వయసుల వారికీ..

కోమటి చెరువు ప్రాంతం అన్ని వయసుల వారికి అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. చెరువు చుట్టూ సరదాగా వాక్ చేసుకుంటూ పచ్చని అందాలను ఆస్వాదించవచ్చు. అలాగే అక్కడి బెంచీలపై కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు. అలా కూర్చొని ఒక చేతిలో కప్పు కాఫీని తాగుతూ ఆస్వాదించవచ్చు.

వైరైటీ ఫుడ్ కోర్ట్స్..

కోమటి చెరువు వద్ద విభిన్న రకాల ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడి సూర్యస్తమయ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. నైట్ విజన్ లో మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు కనులకు వింతైన అనుభవాన్ని పంచుతాయి.

ఇవి కూడా చదవండి

సాహస ప్రియుల కోసం స్కై సైక్లింగ్..

మీరు సాహస యాత్రలు చేయాలనుకుంటే మంచి యాక్టివిటీ కోమటి చెరువులో ఉంది. ఇక్కడి స్కై సైక్లింగ్ పర్యాటకులకు వింతైన అనుభూతి ని ఇస్తుంది. గాలిలో రోప్ సాయంతో సైకిల్ చేసే విన్యాసం చూపరులకు గగుర్పాటుకు గురిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..