Hyderabad: రోడ్లు విస్తరణ పేరుతో హిందూ దేవాలయాలను కూల్చివేస్తే ఊరుకునేది లేదంటూ భజరంగ్‌దళ్ వార్నింగ్

విస్తరణ చేస్తే చేసుకోండి, కానీ హిందూ దేవాలయాల జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదంటోంది భజరంగ్‌దళ్. అభివృద్ధి పేరిట ఆలయాలను కూల్చేస్తే సహించేది లేదని అల్టిమేటం ఇచ్చింది. ఇంతకీ.. ఈ వార్నింగ్‌ ను భజరంగ్‌దళ్ ఎందుకిచ్చిందంటే..

Hyderabad: రోడ్లు విస్తరణ పేరుతో హిందూ దేవాలయాలను కూల్చివేస్తే ఊరుకునేది లేదంటూ భజరంగ్‌దళ్ వార్నింగ్
Roads Wide In Hyderabad
Follow us
Surya Kala

|

Updated on: Jan 04, 2023 | 11:24 AM

రోడ్ల విస్తరణ పేరుతో హిందూ దేవాలయాలను కూల్చివేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది హిందూ వాహిణి, భజరంగ్‌దళ్. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వెంకటేశ్వరస్వామి టెంపుల్‌ రథశాల తొలగింపును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు హిందూ వాహిణి, భజరంగ్‌దళ్ కార్యకర్తలు. ఆందోళనకారులు పెద్దఎత్తున తరలిరావడంతో లాఠీఛార్జ్‌ చేశారు పోలీసులు. రోడ్డు విస్తరణ చేస్తే చేసుకోండి, కానీ హిందూ దేవాలయాల జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదంటున్నారు హిందూ వాహిణి, భజరంగ్‌దళ్ నేతలు

షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కొత్తూరు నుంచి అన్నారం వరకు హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా వెంకటేశ్వరస్వామి ఆలయం రథశాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. ఈ నిర్ణయమే ఇప్పుడు షాద్‌నగర్‌లో మంటలు పుట్టిస్తోంది. అభివృద్ధి పేరిట హిందూ దేవాలయాలను కూల్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..