AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mp Soyam Bapurao: హిందూ దేవుళ్లుపై నోరుజారితే బడితె పూజ చేయండంటూ పిలుపునిచ్చిన ఎంపీ సోయం

హిందూ దేవతలు, దేవుళ్లపై నోరు జారితే వీపు పగలకొట్టాల్సిందే అంటున్నారు ఎంపీ సోయం బాబూరావు. నోరు జారితే బడితె పూజ చేయండంటూ పిలుపునిచ్చారు.

Mp Soyam Bapurao: హిందూ దేవుళ్లుపై నోరుజారితే బడితె పూజ చేయండంటూ పిలుపునిచ్చిన ఎంపీ సోయం
Mp Soyam Bapurao
Surya Kala
|

Updated on: Jan 04, 2023 | 10:45 AM

Share

అయ్యప్ప స్వామి జననం, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌, చదువుల తల్లి సరస్వతి దేవిని అవమానిస్తూ మాట్లాడిన రెంజర్ల రాజేష్‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. హిందూ దేవతలు, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనేపధ్యంలో తాజాగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు  బైరి నరేష్‌, రెంజర్ల రాజేష్‌ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అయ్యప్పస్వామి, సరస్వతిదేవిపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇలాగే ఊరుకుంటే.. రేపు మరో దేవత, దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడే వాళ్లకు బడితె పూజ చేయాల్సిందే అని బీజేపీ ఎంపీ సోయం బాబూరావు ఘాటుగా స్పందించారు.

హిందూ దేవతలు, దేవుళ్లను అవహేళన చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్లను కఠినంగా శిక్షించాలని ఎంపీ సోయం బాబూరావు కోరారు.  అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను, సరస్వతీదేవిని దూషించిన రెంజర్ల రాజేష్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. దొరికితే వీపు మొత్తం పగలకొట్టాలని పిలుపు నిచ్చారు. ఇలాంటి వాళ్లను అడ్డుకోకపోతే రేపు జంగుభాయ్‌ని, జగదాంబదేవిని కూడా దూషిస్తారని.. . అందుకే ఇలాంటి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు ఎంపీ సోయం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..