MLA Durgam Chinnaiah: మందమర్రి టోల్‌ప్లాజా దగ్గర ఎమ్మెల్యే చిన్నయ్య హల్ చల్.. రూట్ క్లియర్ చేయలేదని సిబ్బందిపై దాడి..
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి టోల్ ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్‌చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి టోల్ ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్‌చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నేషనల్ హైవే పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేయడంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబులెన్స్‌లు, ప్రభుత్వ వాహనాలకు రూట్ క్లియర్ చేయకపోవడంతోనే ఎమ్మెల్యే టోల్ సిబ్బందిపై దాడి చేసినట్లు పలువురు పేర్కొంటున్నారు.
కాగా, టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై చిన్నయ్య కూడా స్పందించాల్సి ఉంది.
ఎమ్మెల్యే ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలేమైంది.. ఎందుకు ఎమ్మెల్యే టోల్ ప్లాజా సిబ్బందిపై ఫైర్ అయ్యారు అనే విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..