AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు.. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులపై స్పెషల్‌ డ్రైవ్‌..

తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదాలపై హైదరాబాద్ సిటీ పోలీసుల సీరియస్ అయ్యారు. ఆర్టీసీలని కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతుండటంతో..

Hyderabad: డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు.. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులపై స్పెషల్‌ డ్రైవ్‌..
Hyderabad
Shaik Madar Saheb
|

Updated on: Jan 04, 2023 | 9:37 AM

Share

తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదాలపై హైదరాబాద్ సిటీ పోలీసుల సీరియస్ అయ్యారు. ఆర్టీసీలని కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతుండటంతో.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బోయిన్ పల్లిలో జనవరి 1న ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధ దంపతులు మరణించిన విషయం తెలిసిందే. వారు రోడ్డు దాటుతుండంగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మరణించారు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో 2022లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 13శాతం ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరిగాయని వెల్లడైంది. హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీసుల వద్ద ఉన్న గణాంకాలు ఆర్టీసీ బస్సుల వల్లే ప్రమాదాలు పెరుతుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.

ఈ గణాంకాల ప్రకారం.. హదరాబాద్ నగరంలో గత ఏడాది ఆర్టీసీ బస్సుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 41 మంది చనిపోయారు. మరణించిన వారిలో 21 మంది పాదచారులు ఉన్నారు. అతి వేగం, సిగ్నల్‌ జంపింగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ ఈ ప్రమాదాలకు ప్రధాన కారణామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు.

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించి 2022లో ఆర్టీసీకి 3909 చలాన్‌లు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా బుధవారం నుంచి హైదరాబాద్ నగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నామని ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాల ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఈ డ్రైవ్‌లో ప్రత్యేక దృష్టి పెడుతామని.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఆర్టీసి బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?