Malla Reddy Scholarships: విద్యార్ధులకు బంపర్ ఆఫర్.. మల్లారెడ్డి యూనివర్శిటీ రూ.10 కోట్ల స్కాలర్ షిప్‌లు.. ఇలా అప్లై చేసుకోండి..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jan 04, 2023 | 9:27 AM

కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ)లో విద్యార్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా మల్లా రెడ్డి యూనివర్సిటీ విద్యార్థులకు రూ.10 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు.

Malla Reddy Scholarships: విద్యార్ధులకు బంపర్ ఆఫర్.. మల్లారెడ్డి యూనివర్శిటీ రూ.10 కోట్ల స్కాలర్ షిప్‌లు.. ఇలా అప్లై చేసుకోండి..
Malla Reddy University Scholarships

విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ. MRUCET కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంఆర్సీఈటీ)లో విద్యార్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా మల్లా రెడ్డి యూనివర్సిటీ విద్యార్థులకు రూ.10 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్లుగా తెలిపింది. ఈ అకాడమిక్ ఇయర్ లో ఇంజనీరింగ్, వ్యవసాయం, పారామెడికల్, మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీల్లో ఉన్న కోర్సులకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అడ్మిషన్ కమ్ స్కాలర్‌షిప్ పరీక్ష తేదీలను కూడా వర్సిటీ ప్రకటించింది. ఈ వివరాలను వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డా.వి.ఎస్.కె రెడ్డి తెలిపారు.  హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో 2023-24 కి అకాడమిక్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

మల్లా రెడ్డి యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌ల కోసం పరీక్షలు

ఈ ప్రవేశపరీక్ష ఇండియాలోని అన్ని రాష్ట్రాల బోర్డులు,సెంట్రల్ బోర్డ్, ఇతర గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నామన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల (రిజిస్ట్రేషన్)ప్రవేశాలకోసం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంఆర్‌యూసీఈటీ) ద్వారా ఎప్రిల్23 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. అయితే ఇవి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

ఇందు కోసం వర్సిటీ అధికారిక వెబ్ సైట్  ని సందర్శించి పూర్తివివరాలు తెలుసుకోవాలని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సూచించారు. అన్ని రాష్ట్ర, కేంద్ర బోర్డులకు చెందిన విద్యార్థులు అడ్మిషన్ కమ్ స్కాలర్‌షిప్ పరీక్షకు అర్హులు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు 9497194971 లేదా 9177878365 సెల్‌ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

వర్సిటీ అందించే కోర్సులు

తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయం మల్లా రెడ్డి యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్, Ph.D. కోర్సులను అందిస్తోంది.

ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ సైన్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్, సైన్సెస్, మేనేజ్‌మెంట్/కామర్స్, ఆర్ట్స్‌లో కోర్సులు అందించబడతాయి.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా వారి 10+2 లేదా తత్సమానంలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షలో కనీసం 60 శాతం అవసరం.

ఇతర గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం చూస్తున్న వారు తమ అర్హత పరీక్షలో కనీసం 50 శాతంతో ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాలు కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu