జవవరి 4 నుంచి 7 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎందుకంటే..!
చలిగాలులు తీవ్రరూపం దాల్చాయి. అక్కడ దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా రోడ్లపై ముందు వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు..
ఉత్తర భారతంలో చలిగాలులు తీవ్రరూపం దాల్చాయి. అక్కడ దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా రోడ్లపై ముందు వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇక తాజాగా అక్కడ చలిగాలుల తీవ్రత కారణంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవుల ప్రకటించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంచుకు వాన తోడైంది. మరో రెండు, మూడు రోజులు వడగళ్ల వాన కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది కూడా. దీంతో జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు అక్కడి పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు.
ఈ మేరకు 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కస్తూర్భా గాంధీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్స్‌కు కూడా తాజా ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. విద్యార్ధులతోపాటు ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ నాలుగు రోజులపాటు పాఠశాలలకు వెల్లనవసరం లేదని వివరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.