సినీ పరిశ్రమలో మరో విషాదం.. లెజెండరీ సింగర్ మృతి! సీఎం సంతాపం..
ప్రముఖ బెంగాలీ గాయని సుమిత్రాసేన్ (89) మంగళవారం ఉదయం కలకత్తాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె గత కొంత కాలంగా బ్రోంకో-న్యుమోనియాతో..
ప్రముఖ బెంగాలీ గాయని సుమిత్రాసేన్ (89) మంగళవారం ఉదయం కలకత్తాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె గత కొంత కాలంగా బ్రోంకో-న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత మూడు రోజులకే డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు ఉదయం మళ్లీ ఆమె ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు సుమిత్రాసేన్ కుమార్తె శ్రబానీ సేన్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. గాయని మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.
దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సుమిత్రా సేన్ ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె సేవలకుగానూ 2012లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘సంగీత మహాసమ్మన్’ అవార్డును కూడా అందించింది. రవీంద్ర సంగీత వారసత్వాన్ని ఆమె కొనసాగిస్తూ వచ్చారు. ‘మేఘ్ బోలేచే జబో జబో’, ‘తోమారీ జర్నతలర్ నిర్జోనే’, ‘సఖి భబోనా కహరే బోలే’, ‘అచ్ఛే దుఖో అచ్ఛే మృత్యు’ వంటి పాటలు ఆమె పాడిన వందలాది పాటల్లో ముఖ్యమైనది. సుమారు నాలుగు దశాబ్దాలుగా రవీంద్ర సంగీత ప్రియులను ఆమె పాటలు హితోదికంగా అలరించాయి.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారం కోసం క్లిక్ చేయండి.