Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సినిమా పై సెన్సార్ బోర్డు సభ్యుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా కోసం మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మాస్ రాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్.రవీంద్ర)ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి. మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ తో పాటు.. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. పాటలు, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అద్భుతంగా వున్నాయని, చిరంజీవి, రవితేజలని కలసి తెరపై చూడటం పండగలా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ ని అభినందించారు.
చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#WaltairVeerayya censored with U/A ?
Experience the MEGA MASS action packed entertainer with your Family & Friends this Sankranthi in theaters ??
Mark your Calendars Jan 13th ??
Mass Moolavirat @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl@ThisIsDSP @MythriOfficial pic.twitter.com/pf2QoOL49z
— Bobby (@dirbobby) January 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..