HIT 2 OTT: న్యూఇయర్ గిఫ్ట్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హిట్-2’.. ఎక్కడ చూడొచ్చునంటే?
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం 'హిట్-2'..
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్-2’. ఇందులో మీనాక్షీ చౌదరీ, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించారు. ‘హిట్ ది ఫస్ట్ కేస్’ ఇది సీక్వెల్. మొదటి భాగం కంటే మరింత థ్రిల్లింగ్‌గా ఈ రెండో పార్ట్‌ను డైరెక్టర్ రూపొందించాడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ‘మేజర్’ హిట్ అనంతరం అడివి శేష్ ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ‘హిట్-2’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వారి నిరీక్షణకు తెరపడింది. న్యూఇయర్ గిఫ్ట్‌గా ‘హిట్-2’ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ‘హిట్2’ను రూ.129 చెల్లించి చూడవచ్చు. మరో మూడు రోజుల్లో అంటే జనవరి 6వ తేదీ నుంచి ఎలాంటి అద్దె చెల్లించకుండా ఈ సినిమా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్.. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో అద్దెకు పెట్టిన కొన్ని గంటల్లో అది ఆ ఓటీటీ యాప్‌లో కనిపించకపోవడం గమనార్హం. అసలు ఇంతకీ ‘హిట్-2’ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉందా.? లేక లేదా.? అని ఫ్యాన్స్ సతమతమవుతున్నారు.
కాగా, ఈ సినిమాలో రావు రమేష్, ఆదర్శ్ బాలకృష్ణ, సుహాస్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించగా.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై న్యాచురల్ స్టార్ నాని నిర్మించాడు. మరోవైపు ఈ హిట్ యూనివర్స్ థర్డ్ పార్ట్‌లో నాని హీరోగా నటించబోతున్నాడని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. ఈ భాగంలో నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. అడివి శేష్ సైతం నటించబోతున్నాడట. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్.
View this post on Instagram