ఈ దొంగ రూటే సపరేటు..! చోరీ చేసిన ఇంట్లోనే గుర్రుపెట్టి నిద్రపోయాడు.. కట్‌చేస్తే అదిరిపోయే ట్విస్ట్‌..

దొంగ తనానికి వెళ్తే.. పనిముగించుకుని పరారయ్యే దొంగలను చూసుంటాం..! ఐతే ఈ దొంగ రూటే సపరేటు. ఎవ్వరికంటా పడకుండా ఇంట్లో దూరాడు. నగానట్రా సర్దేశాడు కూడా. అంతలో..

ఈ దొంగ రూటే సపరేటు..! చోరీ చేసిన ఇంట్లోనే గుర్రుపెట్టి నిద్రపోయాడు.. కట్‌చేస్తే అదిరిపోయే ట్విస్ట్‌..
Telangana Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 03, 2023 | 4:22 PM

దొంగ తనానికి వెళ్తే.. పనిముగించుకుని పరారయ్యే దొంగలను చూసుంటాం..! ఐతే ఈ దొంగ రూటే సపరేటు. ఎవ్వరికంటా పడకుండా ఇంట్లో దూరాడు. నగానట్రా సర్దేశాడు కూడా. అంతలో పాపం దొంగగారికి నిద్ర ముంచుకొచ్చింది. ఓ కునుకేద్దామనుకున్నాడు. ఆనక హాయిగా నిద్రపోయాడు. తెల్లారాక కూడా ఇంటి యజమానులు అతన్ని గుర్తించలేదు. అనుకోని విధంగా పాపం దొరికిపోయాడు. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..

తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారంకు చెందిన హన్మంతప్ప ఇంటిల్లిపాదీ శనివారం రాత్రి (డిసెంబర్‌ 31) భోజనాలు ముగించుకుని నిద్రపోయారు. ఐతే అదే గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి వీరి ఇంట్లో చోరీకి ప్లాన్ వేసుకున్నాడు. ఈక్రమంలో అందరూ నిద్రించాక హన్మంతప్ప ఇంట్లోకి మద్యం సేవించి చొరబడ్డాడు శంకర్. నగలు, డబ్బు తీసుకుని వచ్చిన దారినే వెళ్లే సమయానికి.. ఇంట్లో ఓ మూలన పత్తి గుట్ట కనిపించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ పత్తిపై పడుకుని గాఢనిద్ర జారుకున్నాడు. తెల్లారాక హన్మంతప్ప కుటుంబ సభ్యులు తమ పనులు ముగించుకుని ఇంటికి తాళం వేసి తమ పనులకు వెళ్లిపోయారు. వారెళ్లిన కాసేపటికి శంకర్‌కు మెలకువ వచ్చింది. ఇంటి బయట తాళం వేసి ఉండటంతో ఇంట్లోనే ఇరుక్కుపోయాడు.

సాయంత్రం హన్మంతప్ప కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి తలుపు తీయగా తమ ఇంట్లో శంకర్‌ కనిపించాడు. దీంతో ఇరుగుపొరుగు సాయంతో తమ ఇంట్లో చోరికి యత్నించిన శంకర్‌ను బంధించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని హన్మంతప్పకు అప్పగించారు. అనంతరం పోలీసులు నిందితుడిని స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ