Hyderabad: వెలుగులోకి మరో ఎన్నారై భర్త మోసం.. భార్యని పుట్టింట్లో వదిలేసి అమెరికాకు పారిపోయిన మారి మహేష్‌

అమెరికా వెళ్లిన అనంతరం భార్య రామేశ్వరికి ఫోన్ చేసి వారం తర్వాత టికెట్ బుక్ చేస్తానని చెప్పాడు మహేష్‌. ఆ తర్వాత టికెట్లు దొరకడం లేదని వాయిదా వేస్తూ వచ్చాడంటోంది రామేశ్వరి.

Hyderabad: వెలుగులోకి మరో ఎన్నారై భర్త మోసం.. భార్యని పుట్టింట్లో వదిలేసి అమెరికాకు పారిపోయిన మారి మహేష్‌
NRI Husband
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 03, 2023 | 1:47 PM

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ నర్సింహబస్తీకి చెందిన మారి మహేష్‌.. దోమల్‌గూడకు చెందిన రామేశ్వరిని గతేడాది మేలో వివాహమాడాడు. వివాహం అనంతరం భార్యను తీసుకుని జూన్‌ 18న టెక్సాస్‌కు వెళ్లిపోయాడు. కట్నం తక్కువగా వచ్చిందని, ఇంకొకరిని చేసుకుంటే మరింత కట్నం వస్తుందని తరచూ గొడవపడేవాడని ఆరోపించింది రామేశ్వరి. ఈక్రమంలో తన తల్లి ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో ఆగస్టు 18న భార్య రామేశ్వరిని తీసుకుని ఇండియాకు వచ్చాడు మహేష్‌.

ఆగస్టు 18న ఇక్కడకు వచ్చిన మహేష్ భార్య రామేశ్వరిని దోమలగూడలోని పుట్టింట్లో వదిలేసి.. తెల్లారే ఫ్లైటెక్కి అమెరికా వెళ్లిపోయాడు. అమెరికా వెళ్లిన అనంతరం భార్య రామేశ్వరికి ఫోన్ చేసి వారం తర్వాత టికెట్ బుక్ చేస్తానని చెప్పాడు మహేష్‌. ఆ తర్వాత టికెట్లు దొరకడం లేదని వాయిదా వేస్తూ వచ్చాడంటోంది రామేశ్వరి.

రెండు నెలల తర్వాత అక్టోబర్ 23న అమెరికాకు టికెట్‌ బుక్ చేసి కూతుర్ని భర్త మహేష్ దగ్గరికి పంపారు రామేశ్వరి తండ్రి. వెంటనే ఫోన్‌ చేసి మీ కూతురితో తనకేం సంబంధం లేదని.. ఆమె ఎవరో తెలియదంటూ బూతులు తిట్టాడని చెబుతోంది రామేశ్వరి. చిత్రహింసలకు గురిచేసి విడాకుల నోటీసు పంపి సంతకం పెట్టమని బలవంతం చేశాడంటోంది ఆమె.

మహేష్‌ తల్లిదండ్రులను రామేశ్వరి తల్లిదండ్రులు నిలదీయగా.. తమపై దాడి చేయడానికి వచ్చారంటూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. అదే సమయంలో రామేశ్వరి తన తల్లిదండ్రులతో అత్త మామలను కలవడానికి వెళ్లింది. కానీ అత్త మామ ఇంటికి లాక్ చేసి వెళ్లిపోయారు. దీంతో రామేశ్వరి అత్తింటి ముందే ఆందోళనకు దిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం