Manickam Tagore: హుజూరాబాద్ ఫలితాలపై ఆ తర్వాతే స్పందిస్తాం.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్..

Manickam Tagore on Huzurabad by election: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ముందు నుంచి ఫలితాల్లో

Manickam Tagore: హుజూరాబాద్ ఫలితాలపై ఆ తర్వాతే స్పందిస్తాం.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్..
Manickam Tagore
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 02, 2021 | 5:22 PM

Manickam Tagore on Huzurabad by election: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ముందు నుంచి ఫలితాల్లో టీఆర్ఎస్ కంటే.. బీజేపీ ఆధిక్యంలోనే కొనసాగుతూ వస్తోంది. ఈటల రాజేందర్ విజయానికి చేరువలో ఉన్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసుంది. డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్‌ తెలంగాణ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై సమీక్షిస్తామని ఠాగూర్‌ వెల్లడించారు. పార్టీలో దీనిపై చర్చించిన తరువాతే ఈ విషయంపై స్పందిస్తామని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలపై పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఇంకా చూడలేదని.. పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను విన్న తర్వాతే స్పందిస్తానంటూ స్పష్టంచేశారు. బీజేపీకి కాంగ్రెస్‌ సహకరించిందన్న టీఆర్ఎస్‌ వ్యాఖ్యలు కేవలం వారి ఊహలేనంటూ పేర్కొన్నారు. అన్ని అంశాలపై పార్టీలో సమీక్ష చేసుకోని.. తర్వాత మాట్లాతామంటూ పేర్కొ్న్నారు.

కాగా.. వెంకట్‌ను బలి పశువును చేశారు.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హుజూరాబాద్‌లో వెంకట్ బలమురిని బలి పశువును చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్, బట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయం ఇది అని విమర్శించారు. ఒకవేళ హుజూరాబాద్‌లో డిపాజిటివ్ వచ్చి ఉంటే.. రేవంత్ రెడ్డి చరిష్మా వల్లే వచ్చిందని అనేవారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు.. తాము ఎవరూ వెళ్లకపోవడం వల్లే డిపాజిట్ కూడా రాలేదని రేవంత్ అభిమానులు అంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read:

TMC: పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో‎ టీఎంసీ హవా.. అన్ని స్థానాల్లో ఘన విజయం..

Hyderabad Rain Alert: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. మరో గంటలో భారీ వర్షం..