Huzurabad By Poll Result : హుజూరాబాద్‌లో దుమ్మురేపుతున్న ఈటల.. రౌండ్ల వారీగా ఫలితాల వివరాలు మీకోసం..

Huzurabad By Poll Result : హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడిన 15 రౌండ్ల ఫలితాల్లో రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్...

Huzurabad By Poll Result : హుజూరాబాద్‌లో దుమ్మురేపుతున్న ఈటల.. రౌండ్ల వారీగా ఫలితాల వివరాలు మీకోసం..
Bjp Vs Trs
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 02, 2021 | 5:46 PM

Huzurabad By Poll Result : హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడిన 15 రౌండ్ల ఫలితాల్లో రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు. రౌండ్ రౌండ్‌ కు మెజార్టీ పెంచుకుంటూ ఎన్నికల బరిలో ప్రత్యర్థికి చిక్కకుండా దూసుకుపోతున్నారు ఈటల రాజేందర్. ఆఖరికి ప్రత్యర్థి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హిమ్మత్ నగర్, ఆయన అత్తగారి ఊరైన పెద్దపాపయ్యపల్లెనూ ఈటల పాగా వేశారు. గెల్లు శ్రీనివాస్ కంటే కూడా మెజార్టీ ఓట్లను సాధించారు. గెల్లు శ్రీనివాస్ స్వగ్రామమైన హిమ్మత్ నగర్‌లో ఈటల రాజేందర్ 191 ఓట్ల మెజార్టీని సాధించారు ఈటల రాజేందర్. ఇలా ఇప్పటి వరకు 15 రౌండ్ల ఫలితాలు వెలువడగా.. ప్రత్యర్థిపై 11,157 ఆధిక్యంలో ఉన్నారు ఈటల రాజేందర్. మొత్తంగా చూసుకుంటే బీజేపీకి 68,142 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్‌ అభ్యర్థికి 56,985 ఓట్లు పడ్డాయి.

రౌండ్ల వారీగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు పోలైన ఓట్లు, లీడ్ వివరాలు మీకోసం..

1. బీజేపీ – 4610 : టీఆర్ఎస్ – 4444 = బీజేపీ లీడ్ – 166. 2. బీజేపీ – 4851 : టీఆర్ఎస్ – 4659 = బీజేపీ లీడ్ – 192. (టోటల్ లీడ్-358) 3. బీజేపీ – 4064 : టీఆర్ఎస్ – 3159 = బీజేపీ లీడ్ – 905 (1263) 4. బీజేపీ – 4444 : టీఆర్ఎస్ – 3882 = బీజేపీ లీడ్ 562 (1825) 5. బీజేపీ – 4358 : టీఆర్ఎస్ – 4014 = బీజేపీ లీడ్ 344 (2169) 6. బీజేపీ – 4656 : టీఆర్ఎస్ – 3639 = బీజేపీ లీడ్ 1017 (3186) 7. బీజేపీ – 4038 : టీఆర్ఎస్ – 3792 = బీజేపీ లీడ్ 246 (3432) 8. బీజేపీ – 4086 : టీఆర్ఎస్ – 4248 = టీఆర్ఎస్ లీడ్ 162 (3270) 9. బీజేపీ – 5305 : టీఆర్ఎస్ – 3470 = బీజేపీ లీడ్ 1835 (5105) 10. బీజేపీ – 4295 : టీఆర్ఎస్ – 3709 = బీజేపీ లీడ్ 586 (5691) 11. బీజేపీ – 3941 : టీఆర్ఎస్ – 4326 = టీఆర్ఎస్ లీడ్ 385 (5306) 12. బీజేపీ – 4849 : టీఆర్ఎస్ – 3632 = బీజేపీ లీడ్ 1217 (6523) 13. బీజేపీ – 4846 : టీఆర్ఎస్ – 2971 = బీజేపీ లీడ్ 1865 (8388) 14. బీజేపీ – 4746 : టీఆర్ఎస్ -3700= బీజేపీ లీడ్ 1046 (9434) 15. బీజేపీ – 5,507 : టీఆర్ఎస్ – 3,358 = బీజేపీ లీడ్ 2149 (11,157) 16. బీజేపీ – 5,689 : టీఆర్ఎస్ – 3,917 = బీజేపీ లీడ్ 1,712 (13,255) 17. బీజేపీ – 5,610 : టీఆర్ఎస్ – 4,187 = బీజేపీ లీడ్ 1,423 (14,618)

18. బీజేపీ – 5,611 : టీఆర్ఎస్ – 3,735 = బీజేపీ లీడ్ 1,876 (16,494)

19. బీజేపీ – 5,910 : టీఆర్ఎస్ – 2,869 = బీజేపీ లీడ్ 3,047 (19,535)

Also read:

MLA Rapaka: రాజోలు YCP ఇన్ఛార్‌గా జనసేన ఎమ్మెల్యే.? కార్యకర్తలు సంబరాలు.. పాల్గొన్న అమలాపురం ఎంపీ

WhatsApp: వాట్సాప్ నుంచి ఫీచర్ అప్‎డేట్.. ఆ సమయాన్ని పెంచుతారటా..

‘విద్యాకానుక’పై సీఎం జగన్ కీలక ఆదేశాలు.. విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే.. ఖర్చు ఎంతంటే.!