Hyderabad Rain Alert: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. మరో గంటలో భారీ వర్షం..
Hyderabad Rain Alert: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి హెచ్చరిక జారీ చేసింది. భాగ్యనగరంలో
Hyderabad Rain Alert: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి హెచ్చరిక జారీ చేసింది. భాగ్యనగరంలో మరో గంటలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని.. దీనికనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. వర్షం హెచ్చరికల నేపథ్యంలో డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమై రంగంలోకి దిగాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ట్విట్ ద్వారా వెల్లడించింది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు భారీ వర్షం కురుస్తుందని తెలిపింది.
Possibility of moderate to heavy rainfall over the city in the next one hour. Citizens may plan their commute accordingly. DRF teams alerted and on field. @KTRTRS @arvindkumar_ias @CommissionrGHMC @GadwalvijayaTRS pic.twitter.com/pKGEfZFINt
— Director EV&DM, GHMC (@Director_EVDM) November 2, 2021
కాగా.. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Also Read: