Cyber Crime: పెళ్లి సంబంధం పేరుతో టోకరా.. రూ.17.90 లక్షలు కాజేసిన వైనం..

ఇతరులను మోసగించి డబ్బు కాజేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు మోసగాళ్లు. తాజాగా మ్యాట్రీమోనీ సైట్‌లో మహిళగా

Cyber Crime: పెళ్లి సంబంధం పేరుతో టోకరా.. రూ.17.90 లక్షలు కాజేసిన వైనం..
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2021 | 9:54 AM

ఇతరులను మోసగించి డబ్బు కాజేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు మోసగాళ్లు. తాజాగా మ్యాట్రీమోనీ సైట్‌లో మహిళగా పరిచయమైన సైబర్‌ నేరగాళ్లు పెళ్లి చేసుకుంటానని ఓ ఉద్యోగిని నమ్మించారు. వివిధ కారణాలు చెప్పి అతని నుంచి రూ.17.90 లక్షలు దోచుకున్నారు. అయితే అసలు విషయం గ్రహించిన ఆ బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..బోయిన్‌పల్లిలో నివాసముండే ప్రవీణ్‌ ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు.పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తోన్న అతను ఇటీవల షాదీ.కామ్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ చేశాడు.

ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా.. క్లియరెన్స్‌ లేదంటూ.. ఈ ప్రొఫైల్‌ను చూసిన ఓ మహిళ తాను లండన్‌లో ఉన్నానంటూ ప్రవీణ్‌కు ఇంటర్నెట్‌ బేస్డ్‌ వాట్సప్‌ కాల్‌ చేసి మాట్లాడింది. బాధితుడి ప్రొఫైల్‌ బాగా నచ్చిందని, పెళ్లి కూడా చేసుకుందామంటూ అందమైన ఫొటోలు పంపింది. దీంతో ప్రవీణ్‌ కూడా పెళ్లికి సుముఖం వ్యక్తం చేశాడు. ఇక పెళ్లి గురించి అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ తానే స్వయంగా హైదరాబాద్‌ వచ్చి కలుస్తానంటూ ఆ మహిళ బాధితుడిని నమ్మించింది. ఇది జరిగిన వారం రోజుల తర్వాత బాధితుడికి ఫోన్‌ చేసి తనను దిల్లీ ఎయిర్‌పోర్టులో నిలిపేశారని, తన ఇంగ్లిష్‌ మాటలు ఎవరికీ అర్థం కావడం లేదంటూ పక్కనున్న మరో మహిళతో ఫోన్‌ మాట్లాడించింది. కస్టమ్స్‌ క్లియరెన్స్‌ సరిగా లేదని, పెనాల్టీ చెల్లించాలని చెబుతున్నా వినట్లేదని ఆ మహిళ చెప్పింది. ఇదంతా నిజమేననుకున్న బాధితుడు తానే పెనాల్టీ చెల్లిస్తానంటూ రూ. 80 వేలు పంపించాడు. ఆతర్వాత ఆమె వద్ద ఆభరణాలు, పౌండ్లు ఉన్నాయని వాటికి కూడా క్లియరెన్స్‌ లేదంటూ చెప్పి మొత్తం రూ.17.90 లక్షలు వసూలు చేశారు. అయితే అంతటితో ఆగని ఆ మహిళ బాధితుడిని మరింత ముంచాలని ప్రయత్నించింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ప్రవీణ్‌ సోమవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read:

Hyderabad: అయ్యో అమ్మ ఎంత కష్టం.. కళ్ల ముందే కాటికి కన్నబిడ్డలు.. 98 ఏళ్ల వయసులో..

Gutta Suman: గుత్తా సుమన్ నేర చరిత్ర.. బెజవాడ మామిడి తోటల నుంచి కొలంబో కాసినోల దాకా

Anil Deshmukh: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌.. మనీలాండరింగ్‌ కేసులోఈడీ దర్యాప్తు ముమ్మరం