Hyderabad: అయ్యో అమ్మ ఎంత కష్టం.. కళ్ల ముందే కాటికి కన్నబిడ్డలు.. 98 ఏళ్ల వయసులో..
Hyderabad: 98 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో విషాధాన్ని మిగిల్చింది. అంత వయసులో అసలా వృద్ధురాలికి ఆత్మహత్య చేసుకునేంత కష్ట ఏం వచ్చిందని..
Hyderabad: 98 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో విషాధాన్ని మిగిల్చింది. అంత వయసులో అసలా వృద్ధురాలికి ఆత్మహత్య చేసుకునేంత కష్ట ఏం వచ్చిందని ఈ ఘటన చూసిన వారంత వాపోయారు. ఈ హృదయ విదాయకర ఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగరలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నానికి చెందిన కమలమ్మ(98) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన వీరు ఎస్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. కమలమ్మ భర్త 40 ఏళ్ల క్రితం మరణించారు. అనంతరం కొన్నేళ్లకే పెద్ద కుమార్తె అనారోగ్యంతో మరణించింది. దీంతో కమలమ్మ అప్పటి నుంచి కుమారుడు, కోడలితో జీవిస్తున్నారు.
ఈ క్రమంలోనే గతేడాది కుమారుడు రాఘవేందర్‌రావు, కోడలు కరోనాతో మృతిచెందారు. దీంతో కమలమ్మ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటి నుంచి మనవడు కమల్ రామ్‌జీ ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. ఇదే సమయంలో 9 నెలల కిందట చిన్న కుమార్తె డెంగీతో మరణించారు. ఇలా కళ్ల ముందే కుటుంబ సభ్యులంతా మరణిస్తుండడంతో కమలమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలోనే గతంలో ఆమె నివసించిన అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను రక్షించారు.
ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మనువడు కమలమ్మను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇదే సమయంలో శనివారం మనువడు కమల్ ఆయన భార్య డ్యూటీలో భాగంగా బయటకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన కమలమ్మ, సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి చేరుకున్న కమల్ తలుపు మూసి ఉండడంతో, మరో తాళంతో తలుపు తెరిచి చూసే సరికి కమలమ్మ అప్పటికే ఉరివేసుకొని కనిపించింది. కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జీవితంలో వచ్చే ప్రతీ సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం కాదు.. దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని ప్రతీ క్షణం అస్వాదించాలి అప్పుడే కష్టాన్నైనా సంతోషంగా స్వీకరించే ధైర్యం లభిస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఎవరిలో కలిగినా పక్కవారితో కష్టాన్ని పంచుకుంటే ఆ భావనను తరమికొట్టవచ్చు. ఒకవేళ పక్కవారికి చెప్పుకుంటే ఎక్కడ తప్పుగా భావిస్తారో అనుకునే వారు 9152987821 వంటి టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసిన మీ బాధను పంచుకోవచ్చు.
Also Read: Kakatiya University: కాకతీయలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. లాఠీ ఝుళిపించిన పోలీసులు
Silver Price Today: ధంతేరాస్ సందర్భంగా వెండి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధర.. ఎంతంటే..!
Badvel By Election: బద్వేల్ బాద్‌షా ఎవరు?.. మరికొద్ది గంటల్లో తేలనున్న నేతల భవితవ్యం..