Silver Price Today: ధంతేరాస్‌ సందర్భంగా వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన ధర.. ఎంతంటే..!

Silver Price Today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా బంగారం బాటలోన వెండి కూడా..

Silver Price Today: ధంతేరాస్‌ సందర్భంగా వెండి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన ధర.. ఎంతంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 02, 2021 | 5:54 AM

Silver Price Today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా బంగారం బాటలోన వెండి కూడా పరుగులు పెట్టింది. అయితే తాజాగా బంగారం ధర మాత్రం స్థిరంగా కొనసాగగా, వెండి ధర మాత్రం దిగి వచ్చింది. బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. భారతీయులు బంగారం, వెండికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంటాయి. అలాగే వెండితో తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు ఈ రోజు ధంతేరాస్‌.. చాలా మంది ఈరోజు బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజు కొనుగోళ్లు జరిపితే అంతా శుభం జరుగుతుందని భారతీయుల ప్రగాఢ నమ్మకం. ఇక మంగళవారం (నవంబర్‌ 2)న దేశీయంగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.200 వరకు దిగి వచ్చింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.64,400. ► చెన్నైలో కిలో వెండి ధర రూ.68,700. ► ముంబైలో కిలో వెండి రూ.64,400. ► కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,400. ► బెంగళూరులో కిలో వెండి రూ.64,400. ► కేరళలో కిలో వెండి ధర రూ.68,700. ► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,700. ► విజయవాడలో రూ. 68,700 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వినియోగదారులు బంగారం, వెండి కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిదంటున్నారు నిపుణులు.