Ducati: డుకాటి కంపెనీ బైక్‌ ఖరీదు రూ.10 లక్షలు.. ఫీచర్లు, స్పీడ్‌ గురించి తెలిస్తే షాక్ అవుతారు..

Ducati: ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ డుకాటీ సోమవారం భారతదేశంలో స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ఫాస్ట్‌హౌస్ (scrambler desert sled fasthouse) అనే కొత్త బైక్‌ను విడుదల చేసింది.

Ducati: డుకాటి కంపెనీ బైక్‌ ఖరీదు రూ.10 లక్షలు.. ఫీచర్లు, స్పీడ్‌ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Ducati Bike
Follow us
uppula Raju

|

Updated on: Nov 01, 2021 | 9:06 PM

Ducati: ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ డుకాటీ సోమవారం భారతదేశంలో స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ఫాస్ట్‌హౌస్ (scrambler desert sled fasthouse) అనే కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ని పరిమిత సంఖ్యలో తయారు చేస్తామని తెలిపింది. దీని ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. డుకాటి స్క్రాంబ్లర్, అమెరికన్ దుస్తుల బ్రాండ్ ఫాస్ట్‌హౌస్ మధ్య ఒప్పందాన్ని పురస్కరించుకుని ఈ బైక్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది.

స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ఫాస్ట్‌హౌస్ బైక్‌లో 803సీసీ ఇంజన్ ఉంటుంది. ఆఫ్-రోడ్ బైక్‌కి స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ఫాస్ట్‌హౌస్ బైక్ బెస్ట్ ఆప్షన్ అని ఈ విషయం భారత ప్రజలకు బాగా తెలుసని పేర్కొంది. ఇటీవలి కాలంలో ఫాస్ట్‌హౌస్ పూర్తిగా భిన్నంగా కనిపించే స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్​లివర్‌ని కలిగి ఉందని ఇది అత్యంత విలాసవంతమైన ఎడారి యంత్రమని డుకాటి ఇండియా MD బిపుల్ చంద్ర తెలిపారు. ప్రపంచం మొత్తం మీద కేవలం 800 మంది మాత్రమే ఈ డుకాటి స్క్రాంబ్లర్ ఎడారి స్లెడ్‌ని కొనుగోలు చేయగలరని చెప్పారు.

ఈ బైక్ కయాబా సస్పెన్షన్‌తో వస్తుంది. ఈ బైక్ ముందు చక్రం19 అంగుళాలు, వెనుక చక్రం పరిమాణం 17 అంగుళాలు. ఈ బైక్ బ్లాక్, గ్రే రంగులలో వస్తుంది. అలాగే ఇంధన ట్యాంక్‌పై ఫాస్ట్‌హౌస్ లోగోను ఇన్‌స్టాల్ చేశారు. ఇంతకుముందు డుకాటి భారతదేశంలో BS6 డుకాటీ డెసర్ట్ స్లెడ్, స్క్రాంబ్లర్ నైట్‌షిఫ్ట్‌లను విడుదల చేసింది. వాటి ధరలు వరుసగా రూ.10.89 లక్షలు, రూ.9.8 లక్షలుగా నిర్ణయించింది. డుకాటీ స్క్రాంబ్లర్ నైట్‌షిఫ్ట్ కేఫ్ రేసర్ స్టైలింగ్‌తో కూడిన టూరింగ్ మోటార్‌సైకిల్ అవతార్‌గా ప్రారంభించారు. మరోవైప డెసర్ట్ స్లెడ్ ​​స్క్రాంబ్లర్ శ్రేణి ఆఫ్-రోడ్ బైక్ లా ఉంటుంది.

Viral Photos: ప్రపంచంలోనే వింతైనా 5 పువ్వులు.. వీటిని చూశారంటే ‘అద్భుతం’..

Viral Video: ఈ ఏనుగు పిల్ల చేసిన పనికి నవ్వకుండా ఉండలేరు.. వైరలవుతోన్న వీడియో..

Diwali 2021: తమలపాకుతో అదృష్టం.. వ్యాపారంలో అభివృద్ధి.. ఎలాగంటే..?