Amazon Dhanteras Store: కస్టమర్లకు అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్
Amazon Dhanteras Store: దీపావళి పండగ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజాలు అనేక ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది..
Amazon Dhanteras Store: దీపావళి పండగ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజాలు అనేక ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. బంగారం, వెండి నాణేలు, టీవీలు, హోమ్ నీడ్స్‌పై భారీ డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.ధంతేరాస్ సందర్భంగా అమెజాన్ ధంతేరాస్ షాపింగ్ స్టోర్ పేరుతో బంగారు నాణేలపై 20 శాతం డిస్కౌంట్, వెండి నాణేలపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే బంగారం, వెండి ఆభరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు డైమండ్ ఆభరణాలపై జీరో శాతం మేకింగ్ ఛార్జీలు ఉంటాయని, అలాగే ఈ సేల్‌లో ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్, రూపే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. అమెజాన్ ధంతేరాస్ షాపింగ్ స్టోర్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తోంది.
స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై 40 శాతం తగ్గింపును అందిస్తోంది. స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు తగ్గింపు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లపై కూడా 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. కాగా, ఈ-కామర్సే కాకుండా బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించాయి. దీపావళి పండగ సందర్భంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. అలాగే వివిధ కార్ల తయారీ కంపెనీలు కూడా కస్టమర్లకు మంచి ఆఫర్లు కల్పిస్తున్నాయి. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.
ఇవి కూడా చదవండి: