AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ ఏనుగు పిల్ల చేసిన పనికి నవ్వకుండా ఉండలేరు.. వైరలవుతోన్న వీడియో..

సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తాయి. అందుకే చాలా మంది ఇలాంటి వీడియోలు చూడడానికి ఇష్టపడతారు. అందులో చిన్నపిల్లలు చేసే అల్లరి కాని.. పిల్ల జంతువులు చేసే పని చూస్తే నవ్వొస్తోంది...

Viral Video: ఈ ఏనుగు పిల్ల చేసిన పనికి నవ్వకుండా ఉండలేరు.. వైరలవుతోన్న వీడియో..
Elephant
Srinivas Chekkilla
|

Updated on: Nov 01, 2021 | 7:55 PM

Share

సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తాయి. అందుకే చాలా మంది ఇలాంటి వీడియోలు చూడడానికి ఇష్టపడతారు. అందులో చిన్నపిల్లలు చేసే అల్లరి కాని.. పిల్ల జంతువులు చేసే పని చూస్తే నవ్వొస్తోంది. ఓ గున్న ఏనుగు( ఏనుగు పిల్ల) చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ ఏనుగు పిల్లకు దగ్గర్లో చెరకు గడ కనిపించింది. చెరుకు గడ కనిపించిన తర్వాత అది వెంటనే అక్కడి వెళ్లాడానికి ప్రయత్నించింది. కానీ చుట్టు కట్టెలు కట్టడం వల్ల అది బయటకు వెళ్లలేకపోయింది. అయినా అ ఏనుగు పిల్ల తన ప్రయత్నాన్ని మానలేదు. తన తొండంతో చెరుకు తినేందుకు ప్రయత్నం చేసింది. ఈ పిల్ల ఏనుగు ప్రయత్నాన్ని అక్కడనున్న వారు వీడియో తీశారు. ఆ వీడియోను ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోకు 1,300 వ్యూస్ వచ్చాయి.

కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని సత్యమంగళం-మైసూర్ జాతీయ రహదారిపై ఓ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఆ రహదారిలో చెరకు లోడ్‎తో లారీలు వెళ్తున్నాయి. చెరకు వాసన పసిగట్టిన ఓ గజరాజు తన పిల్లతో రోడ్డుపైకి వచ్చింది. లారీకి ఎదురుగా వెళ్లింది. లారీని కదలకుండా చేసింది. దీంతో లారీ అక్కడే ఆగిపోయింది. చెరకు కోసమే ఏనుగు లారీని అడ్డుకుందని భావించిన లారీ డ్రైవర్.. వెంటనే లారీ పైకి ఎక్కి.. కొంత చెరకును రహదారిపై పడేశాడు. అది చూసిన గజరాజు తన ఏనుగు పిల్లతో చెరకు తినడం మొదలు పెట్టింది. దీంతో డ్రైవర్ లారీని ముందు నడిపి అక్కడ నుంచి బయటపడ్డారు. ఈ తతంగాన్ని అంత మరో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానిని ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.

Read Also.. Viral Video: అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. ఇంతలో సీన్ రివర్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!