Viral Video: అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. ఇంతలో సీన్ రివర్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral Video: అడవి నియమాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ బతకాలంటే చంపాల్సిందే. ముఖ్యంగా మాంసాహార జంతువులు నిత్యం వేట కొనసాగిస్తాయి. అడవికి రాజైన సింహం

Viral Video: అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. ఇంతలో సీన్ రివర్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Lions Attack
Follow us
uppula Raju

|

Updated on: Nov 01, 2021 | 4:13 PM

Viral Video: అడవి నియమాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ బతకాలంటే చంపాల్సిందే. ముఖ్యంగా మాంసాహార జంతువులు నిత్యం వేట కొనసాగిస్తాయి. అడవికి రాజైన సింహం బారిన పడ్డారంటే ఆహారం అయిపోవాల్సిందే. తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతుంది. ఇందులో ఓ అడవి దున్నపై రెండు సింహాలు మూకుమ్మడి దాడి చేస్తాయి. కానీ అంతలో సీన్‌ రివర్స్‌ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్కంఠగా చూస్తున్నారు.

నది మధ్యలో ఒక అడవిదున్నను రెండు సింహాలు చుట్టుముట్టడం మనం వీడియోలో గమనించవచ్చు. పాపం ఆ అడవి దున్న ఎటు పోలేని పరిస్థితి నెలకొంటుంది. తప్పించుకోవడానికి ఒక సింహంతో పోరాడుతున్న సమయంలోనే మరొక సింహం దానిపై అటాక్ చేస్తుంది. రెండు కలిసి దానిని కిందపడేసి చంపేసే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇంతలో ఒక వింత జరగుతుంది. మరో రెండు అడవి దున్నలు వచ్చి సింహాలను ఒక్క ఉదుటున కుమ్మేస్తాయి. బతుకు జీవుడా అంటూ ఆ అడవి దున్న ప్రాణాలతో బయటపడుతుంది.

మూడు కలిసి సింహాలను ఓ ఆటాడుకుంటాయి. అందుకే అంటారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే మిత్రుడు ఒకరు ఉండాలని పెద్దలు చెబుతారు. ఒక రోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 24 వేలకు పైగా వీక్షించారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. చాలా మంది వినియోగదారులు తమ స్పందనను తెలియజేశారు. జంతువులకు సంబంధించిన కంటెంట్‌కి సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఎందుకంటే నెటిజన్లు ఉత్కంఠగా వీడియోను చూస్తారు.

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

Viral Video: వీడెవడండీ బాబు.! ఏకంగా పామును ముద్దాడాడు.. షాకింగ్ వీడియో వైరల్.!

Viral Video: ఫేమస్ బ్యూటీషియన్‌లు కూడా పనికిరారు.. ఈ కోతి పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Winter Drinks: శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ఈ డ్రింక్స్‌ తప్పనిసరి..! ఏంటో తెలుసుకోండి..